బంగారం కొనాలనుకునేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..
ABN , Publish Date - Apr 08 , 2026 | 10:45 AM
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం బుధవారం 24 క్యారెట్లపై 3,980 రూపాయలు.. 22 క్యారెట్లపై 3,650 రూపాయలు.. 18 క్యారెట్లపై 2,990 రూపాయలు పెరిగింది.
పసిడి ప్రియులకు షాక్ ఇచ్చే విధంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న (మంగళవారం) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,49,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,37,350 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 1,12,380 దగ్గర ట్రేడ్ అయింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం బుధవారం 24 క్యారెట్లపై 3,980 రూపాయలు.. 22 క్యారెట్లపై 3,650 రూపాయలు.. 18 క్యారెట్లపై 2,990 రూపాయలు పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్‌లో ఉదయం పది గంటల ప్రాంతంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండిపై వెయ్యి పెరిగి 26,500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,53,820
విజయవాడ: రూ.1,53,820
విశాఖపట్నం: రూ.1,53,820
ముంబై: రూ.1,53,820
బెంగళూరు: రూ.1,53,820
ఢిల్లీ: రూ.1,53,970
చెన్నై: రూ.1,54,910
సూరత్: రూ.1,53,870
మధురై: రూ.1,54,910
కోయంబత్తూరు: రూ.1,54,910
ఇవి కూడా చదవండి
రింగ్ రోడ్డులో జిల్లా బస్సుల స్టాప్ మార్పు
ఒక్కేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు