Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిపై ప్రముఖ సింగర్ షకీరా ప్రశంసల జల్లు కురిపించారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు ముందు జరిగే మూడో స్థానం (థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్) మ్యాచ్‌పై ప్రతి టోర్నీలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు మూడో స్థానం కోసం తలపడనున్నాయి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి.
ఫుట్‌బాల్ ప్రపంచంలో అరుదైన సంఘటనకు ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మెస్సి తన చేతులతో స్నానం చేయించిన ఓ చిన్నారి, ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే ప్రత్యర్థిగా నిలుస్తున్నాడు.
చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో సారి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది.
క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎంత హై వోల్టేజ్‌గా సాగుతుందో, ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనాల మధ్య ఆట కూడా అంతే రసవత్తరంగా సాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య 1982లో ఫాక్‌లాండ్ దీవుల కోసం 74 రోజుల పాటు యుద్ధం సాగింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరికొద్ది గంటల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ముందు మెస్సి సేన ఓ వివాదంలో పడింది.
ఫిఫా ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఆటతీరుపై ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచకప్-2026 తొలి సెమీఫైనల్‌లో స్పెయిన్ సునాయాస విజయం సాధించింది. బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో ఓడించి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఫిఫా ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. ఫిఫా మాయలో సమయం తెలియకుండా పోతోందని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.