ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఉద్రిక్తతలు.. అర్జెంటీనాపై ఫిఫా చర్యలు తీసుకుంటుందా..
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:03 PM
క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎంత హై వోల్టేజ్‌గా సాగుతుందో, ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనాల మధ్య ఆట కూడా అంతే రసవత్తరంగా సాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య 1982లో ఫాక్‌లాండ్ దీవుల కోసం 74 రోజుల పాటు యుద్ధం సాగింది.
క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎంత హై వోల్టేజ్‌గా సాగుతుందో, ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనాల మధ్య ఆట కూడా అంతే రసవత్తరంగా సాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య 1982లో ఫాక్‌లాండ్ దీవుల కోసం 74 రోజుల పాటు యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో చివరకు బ్రిటన్ పై చేయి సాధించింది. దీంతో బ్రిటన్‌తో అర్జెంటీనా సంధి కుదుర్చుకుంది (Argentina Falklands banner).
ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన 900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దీవుల విషయంలో ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ దీవులను బ్రిటన్ వాసులు ఇంగ్లీష్‌లో 'ఫాక్‌లాండ్స్' అని పిలుస్తారు. అర్జెంటీనా మాత్రం 'లాస్ మాల్వినాస్' అని సంబోధిస్తుంది. ప్రస్తుతం ఆ దీవుల్లో బ్రిటన్ పరిపాలన కొనసాగుతోంది. మరోవైపు ఆ దీవులపై తమ సార్వభౌమాధికారాన్ని వదులుకోవడానికి అర్జెంటీనా అంగీకరించడం లేదు (Argentina England World Cup 2026).
తాజాగా ఫిఫా ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, అర్జెంటీనా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం అర్జెంటీనా జట్టు సంబరాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. మ్యాచ్ ముగిసిన అనంతరం కొందరు అర్జెంటీనా ఆటగాళ్లు 'లాస్ మాల్వినాస్ అర్జెంటీనావే' అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించడం తీవ్ర చర్చకు దారితీసింది.
ఫిఫా స్టేడియాల్లో రాజకీయ, మతపరమైన లేదా వివాదాస్పద సందేశాలను ప్రదర్శించడం నిషేధం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్యపై ఫిఫా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు ఫిఫా అధికారికంగా ఎలాంటి శిక్షనూ ప్రకటించలేదు (FIFA sanctions).
కాగా, మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి (Falkland Islands controversy). మ్యాచ్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న అర్జెంటీనా ఆటగాడు బార్కో తలపై ఇంగ్లండ్ ప్లేయర్ జూడ్ కొట్టాడు. బార్కో ఏదో అనడం వల్ల జూడ్ కొటినట్టు సమాచారం. అనంతరం ఇరు దేశాల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఫైనల్‌లోకి అర్జెంటీనా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..