వారిని నేల మీదకు దించాలి.. గంభీర్‌కు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన..
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:26 AM
ఇటీవలి యూకే పర్యటనలో టీమిండియా వరుసగా టీ-20 సిరీస్‌లను కోల్పోయిన నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన చేశాడు.
ఇటీవలి యూకే పర్యటనలో టీమిండియా వరుసగా టీ-20 సిరీస్‌లను కోల్పోయిన నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో స్టార్లుగా చెలామణి అవుతున్న యువ ఆటగాళ్లను నేల మీదకు దించాలని సూచించాడు. లేకపోతే భారత క్రికెట్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించాడు (AB de Villiers).
'వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి అసాధారణ ప్రతిభ కలిగిన బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో దీర్ఘకాలం రాణించాలంటే కేవలం ప్రతిభ సరిపోదు. క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, సరైన మార్గదర్శకత్వం కూడా అవసరం. యువ ఆటగాడిని అతిగా పొగడకూడదు. అతడు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ డివిల్లీర్స్ పేర్కొన్నాడు (Gautam Gambhir).
'ఐపీఎల్‌లో ఎన్నో పరుగులు చేసిన ఆటగాళ్లను ఈ పరాజయాలు వాస్తవంలోకి తీసుకువస్తాయి (Vaibhav Sooryavanshi). ఇది అంతర్జాతీయ క్రికెట్ అని వారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బలహీనతకు తావు లేదు. ఐపీఎల్‌లో, మనం పరుగులు చేయగలమని భావించే ఒకరిద్దరు బౌలర్లు ఎప్పుడూ ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో దాక్కోవడానికి చోటు ఉండదు. కాబట్టి మీకు ఒకటి, రెండు కంటే ఎక్కువ గేర్లు అవసరం. మీరు ఎల్లప్పుడూ ఐదో గేర్‌లో బ్యాటింగ్ చేయలేరు' అని డివిల్లీర్స్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
ఫైనల్‌లోకి అర్జెంటీనా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..