Share News

అర్జెంటీనాను తొలగించాలని.. 75 లక్షల మంది సంతకాలతో పిటిషన్!

ABN , Publish Date - Jul 15 , 2026 | 02:56 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరికొద్ది గంటల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ముందు మెస్సి సేన ఓ వివాదంలో పడింది.

అర్జెంటీనాను తొలగించాలని.. 75 లక్షల మంది సంతకాలతో పిటిషన్!
Argentina

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరికొద్ది గంటల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ముందు మెస్సి సేన ఓ వివాదంలో పడింది. ఆ జట్టుకు రిఫరీల నుంచి అనుకూల నిర్ణయాలు వస్తున్నాయంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలైంది. ఫిఫా ప్రపంచ కప్ నుంచి అర్జెంటీనాను తప్పించాలని కోరుతూ 75 లక్షల మందికి పైగా సంతకాలు చేసి పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.


‘ఫిఫా, రిఫరీలు.. లియోనెల్ మెస్సి, అర్జెంటీనా జట్టుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. విజేతను ముందుగానే నిర్ణయిస్తే మిగతా జట్లు ఎందుకు పోటీ పడాలి? అర్జెంటీనాను ప్రపంచ కప్ నుంచి తప్పించి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అర్జెంటీనాపై రిఫరీల పక్షపాతం ఉందంటూ వచ్చిన ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఫిఫా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.


మరోసారి తెరపైకి అర్జెంటీనా-ఇంగ్లండ్ వైరం

ప్రపంచ ఫుట్‌బాల్‌లో చిరకాల ప్రత్యర్థులుగా పేరున్న అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. దక్షిణ అట్లాంటిక్‌లోని ఫాక్‌ల్యాండ్ దీవుల (అర్జెంటీనా భాషలో మాల్వినాస్) వివాదం కారణంగా ఈ రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఫుట్‌బాల్‌లోనూ కనిపిస్తూనే ఉంది. 1986 మెక్సికో ప్రపంచ కప్‌లో డిగో మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌తో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఘటన ఇప్పటికీ ఈ రెండు జట్ల పోరులో ప్రత్యేక గుర్తుగా నిలిచింది.


ఇవి కూడా చదవండి:

నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది ఆ ఇద్దరే: వాషింగ్టన్ సుందర్

బీసీసీఐ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ర్యాన్ టెన్ జట్టును వీడటంపై కొత్త ప్రచారం!

Updated Date - Jul 15 , 2026 | 02:57 PM