Share News

నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది ఆ ఇద్దరే: వాషింగ్టన్ సుందర్

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:05 PM

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(52*) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సుందర్ మాట్లాడాడు.

నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది ఆ ఇద్దరే: వాషింగ్టన్ సుందర్
Washington Sundar

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(52*) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సుందర్ మాట్లాడాడు. తన బ్యాటింగ్‌లో వచ్చిన మార్పుకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిశ్ నెహ్రాలే కారణమని చెప్పాడు. తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించి.. పరిస్థితులకు అనుగుణంగా ఆడేలా తనను తీర్చిదిద్దారని వెల్లడించాడు.


‘టీ20ల్లో ఫినిషర్‌గా, టెస్టుల్లో టాపార్డర్‌లో, వన్డేల్లో పరిస్థితులకు అనుగుణంగా వివిధ పాత్రలు పోషించే అవకాశం నాకు లభిస్తోంది. అలా విభిన్న పరిస్థితుల్లో ఆడటం సవాలుతో కూడుకున్న పనే.. అయినప్పటికే నాకు చాలా ఇష్టం. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించడే నా లక్ష్యం. గౌతీ భాయ్ నా బ్యాటింగ్‌తో నేనేం చేయగలనో.. నా ఆటతీరును ఎలా మెరుగుపరుచుకోవాలో చాలా బాగా అర్థం చేసుకునేలా చేశారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ఒక ప్లేయర్‌గా, వ్యక్తిగా నన్ను నేను మరింత తెలుసుకునేలా చేశారు. నా బ్యాటింగ్‌లో ఇంత మార్పు రావడానికి వారిద్దరే కారణం. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే అనుభవం వస్తుంది. నా సామర్థ్యంపై నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సహించిన నా కోచ్‌లకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని వాషీ వెల్లడించాడు.


ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్.. అక్షర్ పటేల్‌తో కలిసి అజేయంగా 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సుందర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, భారత్ 259 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఛేదించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తొలి వన్డే: కోహ్లీ అరుదైన ఘనత.. పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్

ఫిఫా ప్రపంచ కప్.. మాకు ఫైనల్‌కు వెళ్లే అర్హత లేదు: ఎంబాపె

Updated Date - Jul 15 , 2026 | 12:06 PM