Share News

ఫిఫా ప్రపంచ కప్.. మాకు ఫైనల్‌కు వెళ్లే అర్హత లేదు: ఎంబాపె

ABN , Publish Date - Jul 15 , 2026 | 09:49 AM

ఫిఫా ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఆటతీరుపై ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఫిఫా ప్రపంచ కప్.. మాకు ఫైనల్‌కు వెళ్లే అర్హత లేదు: ఎంబాపె
Kylian Mbappe

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. 2-0 తేడాతో స్పెయిన్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ కీలక పోరులో ఫ్రాన్స్ ఏ విభాగంలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఆటతీరుపై ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాంటి ప్రదర్శనతో ఫైనల్‌కు చేరే అర్హత తమకు లేదని తెలిపాడు.


‘వ్యూహాత్మకంగా, సాంకేతికంగా, మొత్తం ప్రదర్శన పరంగా మేము అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రపంచ కప్ సెమీఫైనల్ వంటి మ్యాచ్‌లో చేయాల్సింది చేయకపోతే విజయం దక్కదు" అని వ్యాఖ్యానించాడు. స్పెయిన్‌ను ఆరంభం నుంచే ఒత్తిడికి గురిచేయాలనేది మా ప్రణాళిక. అయితే ప్రత్యర్థి మిడ్‌ఫీల్డ్‌లో ఆధిక్యాన్ని సృష్టించి మా వ్యూహాన్ని దెబ్బతీసింది. స్పెయిన్ వంటి జట్టుపై అదే పెద్ద సమస్య. మా టచ్, మూవ్‌మెంట్, మొత్తం ఆటతీరు ప్రపంచ కప్ సెమీస్‌కు తగిన స్థాయిలో లేవు’ అని ఎంబాపె అంగీకరించాడు.


కల చెదిరింది..

ఫైనల్‌కు చేరి దేశ ప్రజలకు మరోసారి ఆనందాన్ని అందించాలన్న కల నెరవేరలేదని ఎంబాపె ఆవేదన వ్యక్తం చేశాడు. ‘చరిత్ర సృష్టించాలని అనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం జట్టంతా తీవ్ర నిరాశలో ఉంది. విజయం వచ్చినా, ఓటమి ఎదురైనా తలెత్తుకుని స్వీకరించాలి. కొంత విశ్రాంతి తీసుకుని మళ్లీ కొత్త ఆరంభానికి సిద్ధమవుతాం. ఫుట్‌బాల్ ఎవరి కోసం ఆగదు. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి’ అని ఎంబాపె తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ప్రత్యేక జెర్సీ.. ఫిఫాకు అర్జెంటీనా అభ్యర్థన

Updated Date - Jul 15 , 2026 | 09:49 AM