సమవుజ్జీల సమరం
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:57 AM
ఫిఫా వరల్డ్‌క్‌పలోనే రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు అర్జెంటీనా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరుజట్ల కెప్టెన్లు మెస్సీ, హ్యారీ కేన్...
ఫిఫా వరల్డ్‌కప్
నేటి రాత్రి 12.30 నుంచి
సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ ఢీ
అట్లాంటా: ఫిఫా వరల్డ్‌క్‌పలోనే రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు అర్జెంటీనా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరుజట్ల కెప్టెన్లు మెస్సీ, హ్యారీ కేన్ సూపర్ ఫామ్‌లో ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గతం తాలూకు వివాదాలు, శత్రుత్వం నేపథ్యంలో మెగా టోర్నీలోనే సూపర్ సమరంగా ఈ మ్యాచ్‌ను పరిగణిస్తున్నారు. తరాలు మారినా.. కొత్త ఆటగాళ్లు వచ్చినా.. ఇరుజట్ల మధ్య గాయాలు తాజాగానే ఉండడంతో.. భావోద్వేగాలు కూడా తారస్థాయికి చేరుకొన్నాయి. ఈ నేపథ్యంలో అల్లర్లను నివారించేందుకు పోలీసులు ముందస్తుగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా గ్రూప్‌లో సులువుగానే విజయాలు సాధించినా.. నాకౌట్‌కు వచ్చే సరికి కఠిన పరీక్షలు తప్పలేదు. రౌండ్-32లో పసికూన కేప్ వెర్డెపై కష్టంగా గట్టెక్కగా.. ప్రీక్వార్టర్స్‌లో ఈజిప్ట్ చేతిలో చావు తప్పినంత పనైంది. క్వార్టర్స్‌లో కూడా స్విట్జర్లాండ్ లాంటి బలహీన జట్టుపై నెగ్గడానికి అదనపు సమయం తీసుకొంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనాపై విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
నీలం రంగు జెర్సీలో..
ఈ మ్యాచ్ కోసం అర్జెంటీనా ప్రత్యామ్నాయ జెర్సీని ధరించనుంది. ఇందుకు సంబంధించి నిర్వాహకుల నుంచి అనుమతి కూడా తీసుకొంది. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నేవీ బ్లూ కలర్ జెర్సీని వేసుకొంది. ఆయా మ్యాచ్‌ల్లో నెగ్గడంతో ఇదే సెంటిమెంట్‌ను పాటించనుంది. ఒక రకంగా ఇది ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించే వ్యూహంగా భావిస్తున్నారు.
గత వివాదాలు
1966 క్వార్టర్స్: ఇంగ్లండ్‌తో క్వార్టర్స్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాడు ఆంటోనియా రాటెన్‌ను వివాదాస్పద రీతిలో బయటకు పంపారు. దీంతో క్వీన్ ఎలిజబెత్-2 కోసం ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో దుమారం రేగింది. అంతేకాకుండా ఇంగ్లండ్ మేనేజర్ అల్ఫ్ రామ్సే.. అర్జెంటీనా ప్లేయర్లను జంతువులతో పోల్చడం..ఇరుజట్ల మధ్య చిచ్చును రాజేసింది.
1986 క్వార్టర్స్: గ్రేట్ మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌తో మరోసారి రచ్చ రేగింది. టోర్నీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఈ గోల్ ఇప్పటికీ చర్చనీయాంశమే.
1998 రౌండ్ 16: సెకండాఫ్ ఆరంభంలో సైమన్‌ను నెట్టడంతో ఇంగ్లండ్ స్టార్ బెక్‌హామ్ రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా షూటౌట్‌లో గెలిచింది.
సవాళ్లను అధిగమించి..
ఇంగ్లండ్ కూడా అద్భుత పోరాటాలతోనే ఫైనల్-4కు చేరుకొంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా వెనుకబడినా బలంగా పుంజుకొని విజయాలు సాధిస్తోంది. మెక్సికో, నార్వే నుంచి కఠిన సవాళ్లు ఎదురైనా.. జూడ్ బెలింగ్‌హామ్ అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ్‌సకు చేర్చాడు. ఈ క్రమంలో కేన్, బెలింగ్‌హామ్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉండడంతో.. అర్జెంటీనాకు ఇంగ్లండ్ దీటుగా బదులిచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..
జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం