Share News

19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన చిన్నారి.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో మెస్సికి ప్రత్యర్థి!

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:22 PM

ఫుట్‌బాల్ ప్రపంచంలో అరుదైన సంఘటనకు ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మెస్సి తన చేతులతో స్నానం చేయించిన ఓ చిన్నారి, ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే ప్రత్యర్థిగా నిలుస్తున్నాడు.

19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన చిన్నారి.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో మెస్సికి ప్రత్యర్థి!
Lionel Messi, Lamine Yamal

ఫుట్‌బాల్ ప్రపంచంలో అరుదైన సంఘటనకు ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు మెస్సి తన చేతులతో స్నానం చేయించిన ఓ చిన్నారి, ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే ప్రత్యర్థిగా నిలుస్తున్నాడు. ఆ చిన్నారి మరెవరో కాదు.. స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్. మరోవైపు అతడికి ఎదురుగా నిలిచేది అర్జెంటీనా దిగ్గజం మెస్సి (Lionel Messi, Lamine Yamal).

Lamine Yamal.webp


2007లో బార్సిలోనాలో నిర్వహించిన యునిసెఫ్ స్వచ్ఛంద కార్యక్రమం కోసం క్యాలెండర్ ఫొటోషూట్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో యువ మెస్సి, అప్పటికి కేవలం కొన్ని నెలల వయసున్న లామిన్ యమాల్‌కు స్నానం చేయిస్తూ ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ సమయంలో ఈ చిన్నారి భవిష్యత్తులో ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్‌గా ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఫుట్‌బాల్ అంటే విపరీతంగా ఇష్టపడే ఆ చిన్నారి అంచెలంచెలుగా ఎదిగి స్పెయిన్ జట్టులో స్థానం సంపాదించాడు (FIFA World Cup 2026 Final).

Lamine Yamal4.webp


క్లబ్, దేశం తరఫున ఆడుతున్న యమాల్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు (Argentina vs Spain). ఫుట్‌బాల్ తర్వాతి తరం సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఒకప్పుడు తనకు స్నానం చేయించిన దిగ్గజ ఆటగాడికి ప్రత్యిర్థిగా యమాల్ ఫిఫా ప్రపంచకప్ ఆడబోతున్నాడు. జులై 19వ తేదీన అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య ఫిపా ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.

Lamine Yamal3.webp

Messi.webp


ఇవి కూడా చదవండి..

ఫైనల్‌లోకి అర్జెంటీనా.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలుపు..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 16 , 2026 | 01:44 PM