Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ తుది దశకు చేరుకుంది. రేపు(ఆదివారం)స్పెయిన్, అర్జెంటీనా మధ్య తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఫుట్‌బాల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరుకు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిని.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఓ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశాడు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యమాల్ మాత్రమే కాదు.. మరో ముగ్గురు స్పెయిన్ ప్లేయర్లకు మెస్సితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. తాజాగా వాటికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ఫ్రాన్స్ ప్రధాన కోచ్ డిడియర్ డెశాంప్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ మ్యాచ్ ఆడాలన్న ఆసక్తి ఇరు జట్లకు లేదని ఆయన స్పష్టం చేశారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. వారిలో ఏదో ప్రత్యేకమైన ప్రతిభ సహజంగానే ఉంటుందని అన్నారు.
యమాల్ పసికందుగా ఉన్నప్పుడు దాదాపు 19 ఏళ్ల క్రితం ఓ ఈవెంట్‌లో భాగంగా మెస్సి అతడికి స్నానం చేయించిన ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై మెస్సి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 తుదిపోరు స్పెయిన్, అర్జెంటీనా మధ్య న్యూజెర్సీలోని యార్క్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు.
జులై 18, 19 తేదీల్లో జరిగే అత్యంత కీలకమైన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల వీక్షణ కోసం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బార్ల పనివేళలను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 19న స్పెయిన్, అర్జెంటీనా టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు స్లోవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్ ప్రధాన రిఫరీగా ఎంపికయ్యారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ మధ్య జరగనున్న టైటిల్ పోరుకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించనున్నట్లు ఫిఫా ప్రకటించింది.