Home » Farmers
సిగరెట్ల తయారీలో ఉపయోగించే అనధికారిక పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతివ్వడాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వాగతించారు. కేంద్ర నిర్ణయంతో పొగాకు రైతులకు భారీ ఉపశమనం కలుగుతుందన్నారు.
ధాన్యం సేకరణ కేవలం వ్యాపార లావాదేవీ కాదని.. రైతులకు న్యాయం చేసే పవిత్ర బాధ్యత అని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో జూరాల నుంచి నీటిని అధికారులు విడుదల చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే జూరాల నుంచి నీటిని విడుదల చేశారు.
ఆ ఒంటరి ఏనుగు వస్తోందంటే చిన్నగొట్టిగల్లు,ఎర్రావారి పాలెం మండలాల గ్రామీణజనం హడలెత్తుతున్నారు.
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతిచెందడం విచారకరమని పేర్కొన్నారు.
ఎఫ్‌సీవీ పొగాకు మార్కెట్‌లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ధ్వజమెత్తారు.
ఆక్వా రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కరించారు. ఈ మేరకు మత్స్యశాఖ జీవో నంబర్-1756ను విడుదల చేసింది.
ప్రజలు సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, మత్స్యకారులు, సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన పలు ముఖ్య ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.