Pawan Kalyan: కోనసీమ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:05 PM
రాజోలు నియోజకవర్గ రైతులకు ఐదేళ్లుగా దుఖ:దాయనిగా మారిన శంకర్ గుప్తం మేజర్ డ్రైనేజ్ సమస్యను సుబ్రహ్మణ్య షష్టి రోజున గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం 34 రోజుల కాలవ్యవధిలో శాశ్వత పరిష్కారం దిశగా ముక్కోటి ఏకాదశిన పనులు ప్రారంభించామని వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కోనసీమ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కేసనపల్లి తుఫాన్ సెంటర్‌లో శంకర్ గుప్తం ప్రధాన మురుగు కాలువకు సంబంధించిన ఎనిమిది కిలోమీటర్లు పొడవునా పూడికతీత పనులు,14.5 కిలోమీటర్ల పొడవునా గట్ల పటిష్టత పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు పవన్ కల్యాణ్.
రాజోలు నియోజకవర్గ రైతులకు ఐదేళ్లుగా దుఖ:దాయనిగా మారిన శంకర్ గుప్తం మేజర్ డ్రైనేజ్ సమస్యను సుబ్రహ్మణ్య షష్టి రోజున గుర్తించామని తెలిపారు. కేవలం 34 రోజుల కాలవ్యవధిలో శాశ్వత పరిష్కారం దిశగా ముక్కోటి ఏకాదశిన పనులు ప్రారంభించామని వెల్లడించారు. ఈ పనులకు రూ.20.62 కోట్లు కేటాయించామని అన్నారు. శంకర్ గుప్తం ప్రధాన మురుగు కాల్వతో వరి, కొబ్బరి చెట్లను రైతులు కోల్పోయారని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వివరించారు. కేవలం 34 రోజుల్లోనే ఈ పనుల నిర్వాహణకు నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. కొబ్బరి చెట్లకు నష్టం కలుగకుండా సంరక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.4 వేల కోట్లతో పంట కాలువలు, మురుగు కాలువలు ఆధునీకీకరిస్తామని తెలిపారు. కోనసీమ ప్రాంతoలో కోకో బోర్డు ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వంతో సంప్రదిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శదర్శనం
న్యూఇయర్.. హద్దు దాటితే కఠిన చర్యలు
For More AP News And Telugu News