Share News

MP farmer heart attack: ఎరువుల కోసం ఎదురుచూస్తూ.. గుండెపోటుతో రైతు మృతి..

ABN , Publish Date - Dec 09 , 2025 | 09:01 AM

మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎరువుల కోసం క్యూ లైన్‌లో నిల్చున్న ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

MP farmer heart attack: ఎరువుల కోసం ఎదురుచూస్తూ.. గుండెపోటుతో రైతు మృతి..
Madhya Pradesh farmer death

మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎరువుల కోసం క్యూ లైన్‌లో నిల్చున్న ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. బజ్రువా గ్రామానికి చెందిన జమునా కుష్వాహా సోమవారం ఎరువుల కోసం ఓ గిడ్డంగి ముందు క్యూ లైన్‌లో నిల్చుని ప్రాణాలు కోల్పోయాడు (fertiliser queue death).


బజ్రువా గ్రామానికి చెందిన జమునా కుష్వాహా గత రెండ్రోజులుగా రెండు ఎరువుల సంచుల కోసం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని బడోరా గిడ్డంగి చుట్టూ తిరుగుతున్నాడు. సోమవారం క్యూలో నిలబడి తన వంతు కోసం వేచి ఉండగా, అతను వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. తల తిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే అతడిని స్థానిక తహసీల్దార్ సతేంద్ర గుర్జార్ తన వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు (Madhya Pradesh farmer death).


కొన్ని రోజులుగా టికామ్‌గఢ్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా, ఎరువుల కొరతకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు (fertiliser shortage MP). గత వారం జతారా పట్టణంలోని కొంతమంది రైతులు స్థానిక ఎరువుల పంపిణీ కేంద్రం ఆవరణలో ఆపి ఉంచిన ట్రక్కు నుంచి 40 బస్తాల యూరియాను దోచుకున్నారు. సోమవారం, బల్దేవ్‌గఢ్, ఖర్గాపూర్ ప్రాంతాలకు చెందిన రైతులు ఎరువులు కొరత నిరసిస్తూ దాదాపు మూడు గంటల పాటు టికమ్‌గఢ్-ఛతర్‌పూర్ రహదారిని దిగ్బంధించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి..

వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..


మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. పక్షుల మధ్య సీతాకోక చిలుకను 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 09 , 2025 | 09:01 AM