భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:02 AM
మండలంలోని ఐరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 4.99 ఎకరాల సంబంధించి 16 మంది రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు.
కోసిగి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఐరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 4.99 ఎకరాల సంబంధించి 16 మంది రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు. శుక్రవారం ఐరంగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, కోసిగి తహసీల్దార్ వేణుగోపాల్‌తో కలిసి పనులను పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి భూమి కోల్పోయిన రైతులు ముత్తురెడ్డి తదితర రైతులతో మాట్లాడారు. రైతులు ఒక ఎకరాకు రూ.20లక్షల మేర డిమాండ్ చేశారు. అయితే.. రైతుల అభ్యర్థనను పరిశీలించి పూర్తి న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ చైతన్య, మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఆర్‌ఐ శ్రీరాములు, జూనియర్ అసిస్టెంట్ పరుశురాం, వీఆర్వోలు బసవరాజు, రామాంజనేయులు, ఏసుదాసు, మారెన్న, హనుమంతు, బాలస్వామి, తదితరులు ఉన్నారు.