Home » Election Commission
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ గడువుకు ముందే ఎన్నికల ప్రక్రియ ఈసీ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల సన్నాహకాలు, తుది ఓటర్ల జాబితాపై సమీక్ష కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వచ్చే వారంలో బిహార్‌లో పర్యటించనున్నారు.
ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తు్న్న వారికి ఎన్నికల కమిషన్ కొమ్ముకాస్తోందని రాహుల్ పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. గత గురువారంనాడు కూడా మీడియా సమావేశంలో ఆయన కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటాను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఓటర్ల ఓట్లను ఒక పద్ధతిప్రకారం తొలగించారని ఆరోపించారు
ఆధార్‌ను విలువైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే. ఆధార్ ప్రామాణికత, వాస్తవికతను పరీక్షించే అధికారం అధికారులకే అప్పగిస్తున్నామని తెలిపింది.
ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లు ఇచ్చేటప్పుడే దరఖాస్తు ఫారంపై కొత్తగా తీయించుకున్న ఫోటోను జత చేయాలని అధికారులు కోరారు. రికార్డులు అప్‌డేట్ చేసేటప్పుడు కొత్త ఫోటోలను జత చేసి కొత్త ఓటరు కార్డులు జారీ చేస్తారని ఈసీ వర్గాల పేర్కొన్నాయి.
ఓట్ల చోరీ ఆరోపణలపై తామడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని రాహుల్ అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా లేదని, ఈసీఐ, ఎన్నికల కమిషనర్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
బిహార్‌లో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమం(ఎ్‌సఐఆర్)లో చిరునామా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన విభాగంలో పురుషుల ఓట్ల కన్నా మహిళల ఓట్లను ఎక్కువగా తొలగించినట్లు తేలింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశమయ్యారు.
డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెప్పారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిసీటీవీ ఫుటేజ్‌ను షేర్ చేయకపోవడానికి ఓటర్ల ప్రైవేసీని కాపాడాలన్నదే కారణమని సీఈసీ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఎన్నికల కమిషన్ షేర్ చేయకపోవడంపై రాహుల్ గాంధీ సారథ్యంలోని పలు వివక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.