Bihar Assembly Elections: మరి కొద్ది గంటల్లో బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:42 PM
బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. గత ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా వ్యక్తులు, రాజకీయ పార్టీలకు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం కల్పించింది.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assmebly Elections) ఓటర్ల తుది జాబితా మంగళవారం నాడు విడుదల కానుంది. అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి బిహార్‌లో పర్యటించనున్నారు. అనంతరం వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది.
బిహార్ అసెంబ్లీతోపాటు ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కోసం 470 మంది పరిశీలకులను ఈసీఐ నియమించింది. వారికి దిశానిర్దేశం చేసేందుకు అక్టోబర్ 3న జనరల్, పోలీస్, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లతో ఢిల్లీలో ఈసీ సమావేశమవుతోంది.
కాగా, 243 మంది సభ్యుల బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది. దీంతో తేదీలోగా తాజా ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ పూర్తిచేయాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా జరిగాయి. ఈసారి కూడా ఇదే తరహాలో ఉండవచ్చని చెబుతున్నారు.
బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. గత ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా వ్యక్తులు, రాజకీయ పార్టీలకు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం కల్పించింది. ముసాయిదా జాబితాలో 7.24 కోట్ల ఓటర్లు చోటుచేసుకున్నారు. 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, ఆ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. అర్హత కలిగిన ఓటర్లకు జాబితాలో చోటు కల్పిస్తామని, అనర్హులకు ఎట్టి పరిస్థితిలోనూ చోటుండదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
కేంద్రంతో చర్చలు లేవు.. లెహ్ ఎపెక్స్ బాడీ సంచలన నిర్ణయం
For More National News And Telugu News