Share News

EC to Visit Bihar: బిహార్‌లో పర్యటించనున్న ఈసీ.. అక్టోబర్ 5 తర్వాత ఎన్నికల ప్రకటన

ABN , Publish Date - Sep 27 , 2025 | 08:32 PM

అక్టోబర్ 4,5 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాట్నాలో పర్యటిస్తారు

EC to Visit Bihar: బిహార్‌లో పర్యటించనున్న ఈసీ.. అక్టోబర్ 5 తర్వాత ఎన్నికల ప్రకటన
Election commission

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) వచ్చేవారంలో ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. దీంతో పోల్ షెడ్యూల్‌పై అధికార ప్రకటనకు కౌంట్‍డౌన్ మొదలవుతుంది. అక్టోబర్ 4,5 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాట్నాలో పర్యటిస్తారు. చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఇతరులతో సమావేశమవుతారు.


ఎన్నికల కమిషన్ నవంబర్ 22వ తేదీలోగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అక్టోబర్ 5వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల వర్గాల సమాచారం ప్రకారం ఈసీ నియమించిన పోలీస్, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లతో అక్టోబర్ 3న ఢిల్లీలో సమావేశం ఉంది.


బిహార్‌లో చేపట్టిన ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తికాగానే ఈసీ పర్యటన ఉండనుంది. ఓటర్ల ముసాయిదా జాబితాలో 7.24 కోట్ల మంది ఓటర్లు చోటుచేసుకోగా, వివిధ కారణాల వల్ల 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. దీనిపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు తెలియజేయడానికి సెప్టెంబర్ 1వ తేదీ వరకూ గడువు ఉంది. గడువు ముగియగానే తుది జాబితాను ఈసీ ప్రకటించనుంది.


ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 08:34 PM