Jammu Kashmir polls: జమ్మూకశ్మీర్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన ఈసీ
ABN , Publish Date - Sep 24 , 2025 | 02:42 PM
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కశ్మీర్ (లెజిస్లేచర్‌తో సహా), లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందని, రాజ్యసభకు నాలుగు ఖాళీలు ఏర్పడిన సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఎలక్టరేట్లు లేరని ఈసీ తెలిపింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) నుంచి నాలుగు రాజ్యసభ (Rajya Sabha) సీట్లకు ద్వైవార్షిక ఎన్నికల(biennial elections)ను ఎన్నికల కమిషన్ (Election Commission) బుధవారం నాడు ప్రకటించింది. 2021 నుంచి ఖాళీగా ఉన్న ఈ రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 24న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన గంట తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కశ్మీర్ (లెజిస్లేచర్‌తో సహా), లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందని, రాజ్యసభకు నాలుగు ఖాళీలు ఏర్పడిన సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఎలక్టరేట్లు లేరని ఈసీ తెలిపింది. తాజాగా జమ్మూకశ్మీర్ రికగ్నైజేషన్ యాక్ట్ ప్రకారం నాలుగు రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.
షెడ్యూల్ ఇదే..
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2025 అక్టోబర్ 6న నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 13వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 16వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 24న పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది.
పంజాబ్ నుంచి రాజ్యసభకు ఉపఎన్నిక
కాగా, పంజాబ్‌లో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికల తేదీని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 24న పోలింగ్, అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. గత జూలైలో ఎంపీ సంజీవ్ అరోరా రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 6న నోటిఫికేషన్, అక్టోబర్ 13వ తేదీతో నామినేషన్ల గడువు ముగింపు, అక్టోబర్ 14 నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 16తో నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ముగుస్తుంది. అక్టోబర్ 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. 5 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి..
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం
బెట్టింగ్ యాప్ కేసు..ఈడీ ఎదుట హాజరైన సోనూసూద్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి