Share News

Minister: రెండు ఇడ్లీలు చాలంటే మూడో ఇడ్లీ నోటిలో కుక్కడం భావ్యమా..

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:24 PM

రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేసి తీరాల్సిందేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పట్టుబట్టడం విడ్డూరంగా ఉందని.. ఈ వ్యవహారం రెండు ఇడ్లీలు చాలని చెప్పే బాలుడి నోట్లో మూడో ఇడ్లీ కుక్కినట్లుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ఎద్దేవా చేశారు.

Minister: రెండు ఇడ్లీలు చాలంటే మూడో ఇడ్లీ నోటిలో కుక్కడం భావ్యమా..

- త్రిభాషా విధానం’పై విద్యా శాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ఆగ్రహం

చెన్నై: రాష్ట్రంలో త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేసి తీరాల్సిందేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పట్టుబట్టడం విడ్డూరంగా ఉందని.. ఈ వ్యవహారం రెండు ఇడ్లీలు చాలని చెప్పే బాలుడి నోట్లో మూడో ఇడ్లీ కుక్కినట్లుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌(Minister Anbil Mahesh) ఎద్దేవా చేశారు. దిండుగల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు సహాయాలు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(Union Minister Dharmendra Pradhan) అన్ని రాష్ట్రాలు త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రం వ్యతిరేకిస్తోదని ఆరోపించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే ద్విభాషా విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని,


nani5.2.jpg

త్రిభాషా విద్యావిధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే కేంద్రం దొడ్డిదారిన నిర్బంధంగా హిందీ అమలు చేస్తుందనే విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించారు. కేంద్రం విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందనటానికి విద్యానిధులను నిలిపివేయడమే సాక్ష్యమన్నారు. ఇకనైనా కేంద్రం నిలిపివేసిన విద్యానిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2025 | 01:24 PM