Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది
ABN , Publish Date - Oct 01 , 2025 | 07:32 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు 17 రాత్రి వరకు కొత్తగా ఓటు నమోదుకు 6,563 దరఖాస్తులు, తొలగింపు కోసం 361, సవరణ కోసం 2,298 దరఖాస్తులు వచ్చాయి.
- తుది ఓటరు జాబితా విడుదల
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)కు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు 17 రాత్రి వరకు కొత్తగా ఓటు నమోదుకు 6,563 దరఖాస్తులు, తొలగింపు కోసం 361, సవరణ కోసం 2,298 దరఖాస్తులు వచ్చాయి. సవరించిన జాబితాలో 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 924 మహిళలుగా ఉంది. 1891 మంది దివ్యాంగులు, 95 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు.

సెప్టెంబరు 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉండగా సవరణల తర్వాత 6,976 మంది ఓటర్లను కొత్తగా చేర్చారు. 663 పేర్లు తొలగించారు. పురుషులు 3,415, మహిళలు 3,561 కొత్తగా చేర్చారు. తొలగించిన ఓట్లలో పురుషులు 336 మంది, మహిళలు 327 మంది ఉన్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బీఓల్‌ఓలు 407 మంది, సూపర్‌వైజర్లు 38 మంది ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !
Read Latest Telangana News and National News