Bihar SIR: ఓటర్ల తుది జాబితాలో 47 లక్షల మంది పేర్ల తొలగింపు
ABN , Publish Date - Sep 30 , 2025 | 08:09 PM
ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను ఈనెల 30న ఈసీ ప్రకటించింది. ఇందులో అదనంగా 3.66 లక్షల అనర్హులైన ఓటర్లను తొలగించగా, 21.53 లక్షల అర్హులైన ఓటర్లను జాబితాలోకి చేరింది.
న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పూర్తి చేస్తూ ఎన్నికల కమిషన్ (Election Commission) బిహార్ ఓటర్ల తుది జాబితా (Voter Final list)ను మంగళవారంనాడు విడుదల చేసింది. 22 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియను బిహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టింది. తుది ఎన్నికల జాబితా ప్రకారం 47 లక్షల మంది అనర్హులైన ఓటర్లను ఎన్నికల జాబితా నుంచి ఎలక్షన్ కమిషన్ తొలగించింది.
అర్హులైన ఓటర్లు 7.42 కోట్లు
జూన్ 24వ తేదీ నాటికి ఓటర్ల జాబితోలో 7.89 కోట్ల ఓటర్లు ఉండగా, రివిజన్ తర్వాత 65 లక్షల మందిని అనర్హులైన ఓటర్లుగా గుర్తించి ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. దీంతో ఆగస్టు 1న ప్రచురించిన ఎన్నికల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.24కు చేరింది. అనంతరం ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటించింది. ఇందులో అదనంగా 3.66 లక్షల అనర్హులైన ఓటర్లను తొలగించగా, 21.53 లక్షల అర్హులైన ఓటర్లను జాబితాలోకి చేరింది. ఆ ప్రకారం సెప్టెంబర్ 30న ప్రచురించిన తుది జాబితాలో మొత్తం అర్హులైన బిహార్ ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది.
ఓటర్ల తుది జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఈసీ తెలిపింది. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP)లోని 'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్' ఫీచర్‍లో EPIC నెంబర్ ఎంటర్ చేయడం కానీ, పేరు, పుట్టిన తేదీ వంటి పర్సనల్ డిటైల్స్‌తో సెర్చ్ చేయాలి. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ లేదా అఫీషియల్ ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌తో ఓటర్ల జాబితాలో పేరును వెరిఫై చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి