Home » East Godavari
పోలవరం జిల్లా నేలకోట, పుడిపల్లి ప్రాంతంలో సంచరిస్తున్న పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక హనుమాన్ బృందాలు రాత్రంతా అప్రమత్తంగా పనిచేశాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
పోలవరం జిల్లాలోని పాత నేలకోట సమీపంలో థర్మల్ డ్రోన్‌కు చిక్కిన పెద్దపులి కలకలం రేపుతోంది. పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే 150 మంది సభ్యులతో ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'పార్టీయే సుప్రీం.. కార్యకర్తే నాయకుడు' అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని.. టీడీపీ శ్రేణులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు.
ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
పోలవరం అడవుల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పులి కదలికలపై 24 గంటల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
గోదావరి నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పరిశ్రమలు వ్యర్థాలను గోదావరిలో కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం రాజమండ్రి రూరల్ మండలం వెంకట్ నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న లంకలను పరిశీలించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 216వ జాతీయ రహదారి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.