Share News

నెలంతా..రేషన్‌!

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:59 AM

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): రేషన్‌కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై నెలంతా రేషన్‌ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి ప్రక టించారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో 17 ల

నెలంతా..రేషన్‌!

15రోజుల కాలపరిమితి ఎత్తివేత

365 రోజులు రేషన్‌ దుకాణాలు

17 లక్షల కార్డుదారులు

ఉమ్మడి జిల్లాలో అమలు

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): రేషన్‌కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై నెలంతా రేషన్‌ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి ప్రక టించారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో 17 లక్షల మంది రేషన్‌ కార్డు దారులు ఉన్నారు. వీరందరూ ప్రతి నెల ఒక టో తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే రేషన్‌ డిపోల నుంచి సరుకులు తీసుకుంటు న్నారు. అయితే వివిధ పనులపై ఇతర ప్రాం తాలకు వెళ్లిన కూలీలు, సామాన్యులు ఒక్కొక్క పర్యాయం అనుకున్న సమయానికి రేషన్‌ తీసుకోలేకపోతున్నారు. అలా తీసుకోని నెలలో బియ్యం, పంచదార వంటి నిత్యావసర వస్తు వులు వదిలుకోవాల్సి వస్తోంది. తాజాగా పౌరసరఫరాలశాఖ మంత్రి ఇచ్చిన ప్రకటన నేపథ్యంలో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెల్లు విరిస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే రేషన్‌ ఇవ్వడం వల్ల కేవలం 90 శాతం కార్డుదారులకు మాత్రమే రేషన్‌ సరఫరా అవుతుంది. ప్రధానంగా నగ రాల్లో, పట్టణాల్లో అయితే పోర్టబులిటీ విధా నం వల్ల ప్రతి నెల పదో తేదీ వచ్చే సరికే పలు దుకాణాల్లో బియ్యం నిండు కుంటు న్నా యి. ఇతర రాష్ట్రాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన కార్మికుల కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో ప్రధానంగా కాకినాడ, అమలాపురం, రాజ మహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు తదితర పట్టణాల్లో ప్రతి నెల పదో తేదీకే 50 శాతం రేషన్‌ దుకాణాల్లో బియ్యం నిండుకుం టున్నా యి. దీనివల్ల బియ్యాన్ని పేదలు పొందలేక పోతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే నెలంతా రేషన్‌ పంపిణీ ద్వారా సాధ్యపడుతుంది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు రేషన్‌ పంపిణీ చేయడం వల్ల ఏదైనా వీలున్న సమయంలో సరకులు తెచ్చుకునే సౌలభ్యం లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో ఉన్న రెండువేల రేషన్‌ దుకాణాలు ఇక నుంచి నెలంతా ఓపెన్‌ చేసే ఉంటాయి. పేదలకు సరుకులు పంపిణీ చేస్తూనే ఉంటాయి.

త్వరలో మరిన్ని సరుకులు

ఇక నుంచి రెగ్యులర్‌గా ప్రతినెల కందిపప్పు, నూనె, రాగులు, గోధుమపిండి రేషన్‌ కార్డుదారులకు ఇస్తామని మంత్రి ప్రకటిం చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కందిపప్పు, పామాయిల్‌, గోధుమపిండి వినియోగం ఎక్కువ. దీంతో కార్డుదారులు స్వాగతిస్తున్నారు.

ఉత్తర్వులకు ఎదురుచూపులు..

దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని కాకినాడ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి రుద్రరాజు సత్య నారాయణరాజు తెలిపారు. ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానిలో పేర్కొన్న విధంగా జిల్లాలో రేషన్‌ దుకాణాలు తెరిచి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు రేషన్‌ దుకాణాల ద్వారా సమర్థంగా, నిత్యా వసరాలు సకాలంలో అందజేస్తామన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 01:59 AM