Share News

Nimmala blasts Jagan: జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన మంత్రి నిమ్మల

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:41 PM

ఐదేళ్ల పాటు నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 50 వేల కోట్ల పంట నష్టానికి కారణమై చరిత్ర హీనుడిగా నిలిచారని మంత్రి నిమ్మల అన్నారు. జగన్ ఆల్మట్టి గురించి ఇప్పుడు ఆందోళన చెందటం దెయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ సెటైర్ విసిరారు.

Nimmala blasts Jagan: జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన మంత్రి నిమ్మల
Nimmala blasts Jagan

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్టోబర్ 2: జిల్లాలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఈరోజు (గురువారం) పర్యటించారు. ఈ సందర్భంగా రాజోలు కాటన్ పార్క్ దగ్గర వశిష్ట ఎడమ కాలువ ఏటిగట్టును పటిష్ట పరిచే పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. అబద్ధాల కోరు జగన్‌కు ఆల్మట్టిపై అవగాహన లేదని విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాటు నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 50 వేల కోట్ల పంట నష్టానికి కారణమై చరిత్ర హీనుడిగా నిలిచారన్నారు. జగన్ ఆల్మట్టి గురించి ఇప్పుడు ఆందోళన చెందటం దెయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ సెటైర్ విసిరారు.


ఆల్మట్టి గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతరాయం లేని పోరాటం చేస్తోందని వెల్లడించారు. ఆల్మట్టి ఎత్తు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనను ఆది నుంచి అడ్డుకున్నదని.. న్యాయవ్యవస్థను ఆశ్రయించి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఈనాటికి పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసింది జగన్ అంటూ దుయ్యబట్టారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారకుడు జగన్ అని ఆరోపించారు.


ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వట్టిగా పడి ఉండడానికి కారకుడు జగన్ అని.. రాయలసీమ ప్రాజెక్టులు నత్తనడకు కారణం జగన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఫేక్ ప్రారంభాలు చేసి అభాసుపాలు అయ్యింది జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ అసలు రూపాన్ని, అంతర్గతంగా ఉన్న అరాచక శక్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే తిప్పి కొట్టారన్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఏమీ చేయకుండా చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు అంటూ నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి

విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా

సెంట్రల్ పార్క్ నమూనాతో అమరవతిలో భారీ పార్క్‌లు

Read latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 12:44 PM