Share News

Visakhapatnam RTA: విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:14 PM

ప్రయాణికులపై అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు. కొన్ని బస్సులపై పరిమితి నుంచి రవాణా చేస్తున్నట్లు బయటపడింది.

Visakhapatnam RTA: విశాఖలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా
Visakhapatnam RTA

విశాఖపట్నం, అక్టోబర్ 2: నగరంలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ (RTA Raids) కొరడా ఝుళిపించింది. ఈరోజు (గురువారం) అగనంపూడి టోల్గేట్ జాతీయ రహదారి వద్ద ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పండుగ సందర్భంగా సొంతూళ్లకు పయనమయ్యారు ప్రజలు. ఈ క్రమంలో ప్రయాణికులపై అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడులు చేశారు అధికారులు. బస్సుల్లో భారీగా ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించారు. కొన్ని బస్సులపై పరిమితి నుంచి రవాణా చేస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకు 44 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు.


దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఫైన్ విధించారు. ఒరిస్సా, తమిళనాడుకు చెందిన బస్సులను సీజ్ చేశారు అధికారులు. ఒక్కో ప్రయాణికులపై ఐదు వందలు నుంచి 1000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో అప్పటికప్పుడు ఆయా బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు భారీగా ఫైన్ విధించారు .


ఇవి కూడా చదవండి

సెంట్రల్ పార్క్ నమూనాతో అమరవతిలో భారీ పార్క్‌లు

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రికి సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు

Read latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 12:38 PM