Share News

CM Chandrababu Tributes: గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రికి సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు

ABN , Publish Date - Oct 02 , 2025 | 11:03 AM

దేశ స్వాతంత్ర్య సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని అన్నారు సీఎం చంద్రబాబు.

CM Chandrababu Tributes: గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రికి సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు
CM Chandrababu, lokesh Tributes

అమరావతి, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఘన నివాళులు అర్పించారు. అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని అన్నారు సీఎం. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశంలో కొత్త ఉత్సాహం నింపారు మాజీ ప్రధాని అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం, మంత్రి లోకేష్ ఆ మహనీయుల సేవలను స్మరించుకున్నారు.


చంద్రబాబు ట్వీట్ ఇదే..

‘దేశ స్వాతంత్ర్య సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ. ఆ మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలి. అప్పుడే మనం కలలు కంటున్న నవ భారత దేశం సాకారం అవుతుంది’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఆ మహనీయుడి బాటలోనే...

‘జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశంలో కొత్త ఉత్సాహం నింపిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. దేశ స్వాతంత్య్రం కోసం అహరహం పరితపించిన ఆ మహనీయుడు చూపిన బాట మనకు అనుసరణీయం. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగనిరతి యువతరానికి స్ఫూర్తి కావాలి. ఈ సందర్భంగా మరొక్క మారు ఘన నివాళి అర్పిస్తూ ఆయన కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్ట్ చేశారు.


లోకేష్ ట్వీట్..

‘అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర్య ఉద్యమంలో ముందు నడిచి కోట్లాది భారతీయుల్లో చైతన్యాన్ని రగిలించారు. గాంధీజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి’ అని అన్నారు.


నీతికి, నిరాడంబరతకు మారు పేరు...

‘స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తుదిశ్వాస వరకు దేశం కోసం సేవలందించిన నిస్వార్థ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. నీతికి, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారు. వారి జయంతి సందర్భంగా దేశ అభ్యున్నతికి అందించిన సేవలను స్మరించుకుందాం’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఈనెల 6న స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం

సెంట్రల్ పార్క్ నమూనాతో అమరవతిలో భారీ పార్క్‌లు

Read latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 11:22 AM