Coconut Tree : కల్పవృక్షం.. కొబ్బరిచెట్టు. నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:11 PM
కొబ్బరి పేరు చెప్పగానే మనందరకీ గుర్తొచ్చేది కోనసీమ. ఎటుచూసినా పైరు పచ్చని వరి చేలు.. కల్పవృక్షాల్లాంటి కొబ్బరిచెట్లు.. వాటికి నలుదిక్కులా గెలలతో కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. కోనసీమ రైతుల బతుకు బండి కొబ్బరి పంటపైనే ఆధారపడి ఉంది.
కల్పవృక్షం.. కొబ్బరిచెట్టు
» రికార్డు స్థాయిలో కొబ్బరి ధరలు
» నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం
అంబాజీపేట, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కొబ్బరి పేరు చెప్పగానే మనందరకీ గుర్తొచ్చేది కోనసీమ. ఎటుచూసినా పైరు పచ్చని వరి చేలు.. కల్పవృక్షాల్లాంటి కొబ్బరిచెట్లు.. వాటికి నలుదిక్కులా కొబ్బరి గెలలతో కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. సూర్యరశ్మిని సైతం నేలపైకి పడకుండా గొడుగు మాదిరిగా ఉంటూ సూర్యకిరణాలు కొద్దిగా నేలపై పడుతూ కనిపించే దృశ్యాలు కోకొల్లలు. కోనసీమ రైతుల బతుకు బండి కొబ్బరి పంటపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతుంటే అధిక భాగం కోనసీమలో విస్తరించి ఉండడంతో కోనసీమకు కొబ్బరిసీమ అని పేరు వినిపిస్తుంటుంది. కొబ్బరి చెట్ల అందాలను తమ కెమేరాల్లో బంధించేందుకు తహతహలాడుతున్నారు ఫొటోగ్రాఫర్లు, సినీ దర్శకులు. అందుకే చాలా సినిమాల్లో కోనసీమ కొబ్బరి అందాలు వర్ణిస్తూ ఎన్నో సినిమాలను కూడా చిత్రీకరించారు. ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
కొబ్బరి దినోత్సవం ఇలా మొదలైంది..
ప్రతి ఏటా సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినో త్సవం జరుపుకోవడం పరిపాటి. ప్రపంచంలో కొబ్బరికాయల సాగులో మొదటిస్థానంలో ఉన్న ఇండోనేషియా వ్యవస్థాపక దినోత్సవం ఇదే రోజున. ఆ దేశాన్ని గౌరవిస్తూ కోకోనట్ డేను ఈరోజు నిర్వహిస్తుంటారు. మనదేశానికి కూడా ఆ సంఘంలో సభ్యత్వం కావడం.. మనకూ కొబ్బరి మీదే ఓ రాష్ట్రం ఉండడం.. మన రాష్ట్రంలో కోనసీమంతా కొబ్బరి పరిమళాన్ని వెదజల్లడంతో ఆ దినోత్సవం ఇక్కడా ప్రత్యేకమైపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొబ్బరిసాగు రైతుల సమక్షంలో కొబ్బరికాయల వాడకం ప్రాముఖ్యంపై ప్రజలకు తెలియచేయడం, కృత్రిమ శీతల పానీయాల కంటే కొన్ని రెట్లు మెరుగైన సహజసిద్ధమైన కొబ్బరినీళ్లు తాగడంలో ప్రయోజనాలు వివరించడం, కొబ్బరి పరిశ్రమలో పెట్టుబడులను ప్రోత్సహించడం వంటివి కోకోనట్ డే ప్రధాన లక్ష్యం.
కోనసీమ కొబ్బరి..
తెలుగువారికి కొబ్బరి అనగానే కోనసీమ గుర్తుకు వస్తుంది. ఉభయగోదావరి జిల్లాలు విరివిగా కొబ్బరి పండిస్తే తూర్పుగోదావరి జిల్లానే మొత్తం రాష్ట్ర పంటలో సగం వరకూ ఉంది. అందులోనూ ఎక్కువ వాటా కోనసీమదే. నేల నాణ్యత, అధికతేమ, వర్షపాతం వంటి అంశాలు కోనసీమలో కొబ్బరిసాగుకు ఎంతగానో తోడ్పడతాయి. ఇక్కడి కొబ్బరి రైతులు కొబ్బరి చెట్లతో అవినాభావ సంబంధం కలిగి ఉంటారు. వాటిని తమ కు టుంబసభ్యుల్లా చూసుకుంటారు. నిజానికి ఒక కొబ్బరి చెట్టు కొడుకుతో సమానమని చెప్పుకొంటారు. అంటే ఒక కొబ్బరిచెట్లు ఉంటే కుటుంబాన్ని సునాయాసంగా వెళ్లదీయవచ్చునని భావం.. ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాల్లో కొబ్బరి సాగు తగ్గుతోంది. ప్రభుత్వపరంగా సరైన ప్రోత్సాహం లేక రైతులు నిరుత్సాహపడుతున్నారు. ఎకరానికి 10 వేల కాయలు కాయించే కోనసీమ కొబ్బరి పంటను ఆధారం చేసుకుని విశేష నైపుణ్యాలు అభివృద్ధిలయ్యాయి. కొబ్బరిచెట్లు ఎక్కేవాళ్లు, కాయలను ఒలిచే వాళ్లువంటి ప్రత్యేకమైన పని వాళ్లు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నారు.
కోనసీమదే అగ్రభాగం
కొబ్బరి పండించే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశాలు ముఖ్యమైనవి. వీటిలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కోనసీమలోని అంబాజీపేటదే అగ్రభాగం, కేరళ అలెప్పి తర్వాత అంబాజీపేటదే అగ్రస్థానం. 125లక్షల హెక్టార్లలో కొబ్బరి పంట ఇక్కడ సాగవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతం మాదిరిగా కొబ్బరి రైతులకు ఆదాయం సమకూరుతుంది. అందుకే ఈ పంట అంటే ఇక్కడి రైతులకు అమితమైన అభిమానం. జీవిత చరమాకంలో ఉన్న వారు కన్న కొడుకు కంటే కొబ్బరి చెట్టునే ఎక్కువ ప్రేమిస్తాడు.. ఆరాధిస్తాడు..
కొబ్బరి చెట్టుకు ప్రత్యేక స్థానం
కొబ్బరిచెట్టు నిజంగానే కల్పవృక్ష సమానం. మన జీవనంలో కొబ్బరిచెట్టుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. పచ్చికొబ్బరి నుంచి ఎండు కొబ్బరి వరకూ అనేక రకాలుగా కొబ్బరిని వంటల్లో వా డడం, కొబ్బరినూనె, కొబ్బరినీరు దివ్య ఔషధాలుగా వాడుతుంటారు. కొబ్బరి పీచుతో కార్పెట్లు, క్వాయర్ పరుపులు, తాళ్లు తయారు చేస్తారు. కొబ్బరి మట్టలు, వంట చెరకుగా ఉపయోగిస్తారు. కొబ్బరి ఆకు ఈ నెలతో చీపుర్లు తయారు చేస్తారు. ఇటీవల పచ్చని కొబ్బరి ఆకులతో వివిధ రకాల ఆకృతులను తయారు చేసి వాటిని పెళ్లి మండపాలు, పందిర్లలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.
ఎన్నడూ లేని విధంగా ధరలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది. కొబ్బరి ధరలు పుంజుకున్నాయి. పచ్చికాయల ధరలకు రెక్కలు రావడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం పచ్చికొబ్బరికాయల ధరలు రూ.22 వేల పైబడి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.10వేల నుంచి అమాంతంగా రూ.22 వేలకు పైబడి ధరలు పెరగడంతో రైతులు కొబ్బరితోటల వైపు దృష్టిసారించారు.
కొబ్బరి వల్ల ఉపయోగాలు
కొబ్బరి గుజ్జులో 46 శాతం తేమ, 37శాతం కొవ్వు, మిగతా శాతం లవణాలు, ప్రొటీన్లు, ఉంటాయి.
కొబ్బరి ప్రొటీన్లలో అధికశాతం అమినో యాసిడ్లు ఉన్నాయి.
ఎండు కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి నూనెలోని కీటోన్, లాక్టోన్ ఆల్కాహాల్ వల్ల ఆ నూనెకు ప్రత్యేక వాసన వస్తుంది.
ఆరోగ్యపరంగా నట్స్తో పోలిస్తే కాబ్బరిలో సంతృప్తికరమైన కొవ్వులు ఎక్కువ. అందులో ఆరోగ్యానికి మేలు చేసే లారిక్ ఆమ్లం చాలా ఎక్కువ. ఇది మోనోలారిన్ మారి అంటువాధ్యులు రాకుండా అడ్డుకుటుంది.
లాక్టోజ్ పడని చిన్నారులు, గర్భిణు లకు కొబ్బరినీళ్లు, కొబ్బరిని రుబ్బి తీసిన పాలను తీసి ఇస్తే గ్లూకోజ్లో పనిచేస్తుంది.
కొబ్బరి నీరు శరీరాన్ని చల్లభరచడమే కాకుండా జీర్ణక్రియకు సంబంధించి సమస్యలను నివారిస్తుంది. అతిసార వ్యాధి బాధితులు ఆ సమస్యల నుంచి బయటపడేందుకు కొబ్బరి నీటిని తీసుకొంటే మంచిదని వైద్యులు చెప్తున్నారు.
మూత్ర పిండాలు, మూత్ర నాళాల్లో ఏర్ప డే రాళ్లను కరిగించే గుణం కొబ్బరి నీట్లో ఉంది.
మాములుగా కొబ్బరినూనె ఎండబెట్టిన కొబ్బరి నుంచి తీస్తారు. పచ్చికొబ్బరి నుంచి కూడా నూనె తీయవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
For More AP News And Telugu News