గుడ్డు.. బ్యాడ్డు...
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:24 AM
అనపర్తి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్లకు మంచి ధర పలకడంతో పౌలీ్ట్ర రైతులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులుగా రైతుకు దక్కే గుడ్డు ధర అంతకంతకూ దిగజారిపోతోంది. ప్రస్తుతం గుడ్డు ధర పేపర్ రేటు ప్రకారం రూ.5.45కు పడిపోయింది. ఇది కూడా రైతుకు పూర్తిగా దక్కడం లేదు. ఈ ధరలో ఏజంటు కమిషన్ రూ.0.25 పైసలు పోతుంది. అంతేగాకుండా ట్రేడర్లు నిర్ణయించిన కమింగ్ రేటు ప్రకారమే ఇప్పు
గుడ్డు ధర దోబూచులాట
మొన్నటి వరకు బాగున్నా.. తాజాగా పతనం
రైతు ధర రూ.5.45..చేతికి దక్కేది ఐదే
మరోవైపు పడిపోయిన దిగుబడులు
బహిరంగ మార్కెట్‌లో మాత్రం ధర రూ.7
అనపర్తి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్లకు మంచి ధర పలకడంతో పౌలీ్ట్ర రైతులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులుగా రైతుకు దక్కే గుడ్డు ధర అంతకంతకూ దిగజారిపోతోంది. ప్రస్తుతం గుడ్డు ధర పేపర్ రేటు ప్రకారం రూ.5.45కు పడిపోయింది. ఇది కూడా రైతుకు పూర్తిగా దక్కడం లేదు. ఈ ధరలో ఏజంటు కమిషన్ రూ.0.25 పైసలు పోతుంది. అంతేగాకుండా ట్రేడర్లు నిర్ణయించిన కమింగ్ రేటు ప్రకారమే ఇప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయి. దాంతో రైతు చేతికి రూ.5 మాత్ర మే దక్కుతోంది. ఈ ధర ఎంతమాత్రం గిట్టుబాటు కాదని పౌలీ్ట్ర రైతులు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి కోళ్లకు ఇటీ వల పలు రకాల తెగుళ్లు రావడంతో కోళ్ల సంఖ్య పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో సు మారు 1.30 కోట్ల కోళ్లు ఉండగా, వీటి సం ఖ్య 90 లక్షల వరకు పడిపోయింది. దీంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. రోజు కు సుమారు 1 కోటి వరకు ఉత్పత్తి అయ్యే గుడ్లు ప్రస్తుతం 65 లక్షల నుంచి 70 లక్షలకు పడిపోయాయి. మన రాష్ట్రంలోనే కా కుండా ఇతర రాష్టా్ట్రల్లోనూ ఇదే పరిస్థితి ఎదురై కోళ్లు చనిపోవడంతో గుడ్లకు గిరాకీ పెరిగి గుడ్డు ధర రూ.5.90 వరకు ఎగబా కింది. అయితే గత పది రోజులుగా గుడ్డు ధర పడిపోవడం ప్రారంభించి ప్రస్తుత ధర రూ.5.45పైసలుగా ఉంది. ఉత్పత్తి తగ్గినా గుడ్డు ధర ఆశాజనకంగా ఉందని రైతులు సంబరపడినంత సమయం కూడా లేకుండా పతనం దిశగా పయనిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలకాలంలో ఒడిసా సహా ఇతర రాష్ట్రాల్లో పౌలీ్ట్రల సంఖ్య పెరగడంతో ట్రేడర్లు కూడా మన గోదావరి ప్రాంత ఎగుమతులపై ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుతం కమింగ్ ధరకే ప్యాకేజీలు జరుగుతుండడంతో పేపర్ ధర రూ.5.45 ఉన్నప్పటికీ ఏజంటు కమిషన్ 0.25 పైసల భారం ఎలాగూ రైతుపైనే పడుతోంది. అంతేకాకుండా అక్కడి ట్రేడర్లు నిర్ణయించిన ధరనే కమింగ్ రేటుగా పరిగణించడంతో ప్రస్తుతం రైతు చేతికి రూ.5.00 మాత్రమే చేరుతోంది. ప్రస్తుతం కొత్త బ్యాచ్‌లు వేయడంతో అవి గుడ్డు పెట్టే దశకు చేరుకునేందుకు మరో నాలుగైదు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు ఇదే పరిస్థితి కొనసాగితే తాము నష్టాల బారిన పడతామని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఫీడ్ ధరలో పెద్దగా మార్పు లేకపోవడంతో టన్నుకు రూ.30 వేల వరకు వెచ్చించాల్సి వ స్తోందని, గుడ్లు ఉత్పత్తి పెరిగే వరకు రూ.6.00 ఽపైబడి ధర పలికితే గాని తాము కోలుకోలేమని రైతులు అంటున్నారు. వచ్చే శీతాకాలంపైనే ఆశలు పెట్టుకున్నామని, అప్పటికైనా ధర పెరిగితే నష్టాలు తగ్గుతాయని చెబుతున్నారు.
మార్కెట్‌లో ఇష్టారాజ్యం
వినియోగదారుల కోణంలో చూస్తే కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక్కొ గుడ్డు ధర రూ.6.50 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.7 నుంచి ఏడున్నర వరకు విక్రయాలు సాగుతున్నాయి. దాంతో చాలా దారుణంగా కోడిగుడ్ల ధరలు పెరిగిపోయాయని సామాన్యులు గగ్గోలుపెడుతున్నారు. పౌష్ఠికాహారం కోసం ఎక్కువగా గుడ్లనే వినియోగిస్తున్నందున అధిక భారం పడుతోందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రైతు వద్ద ధరలు తగ్గుతుండడంతో అటు హోల్‌సేల్‌లోనూ, ఇటు రిటైల్‌లోనూ ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం రిటైల్‌లో ఏడు రూపాయల ధరలోనే విక్రయాలు సాగుతుండడం గమనార్హం.
కోళ్ల పరిశ్రమకు పూర్వవైభవం చంద్రబాబు చేతుల్లోనే ఉంది
రాష్ట్రంలో ఏ పరిశ్రమ ఎలా ఉంది, ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలిసిన విధంగా మరే ముఖ్యమంత్రికి తెలియదనడంలో అతిశయోక్తి లేదు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను తెలుసుకుని అనేక రాయితీలు కల్పించారు. ప్రస్తుతం పరిశ్రమ అప్పటికన్నా మరింత సంక్షోభంలో ఉంది. ప్రభుత్వపెద్దలు కోళ్ల పరిశ్రమపై దృష్టి సారించి పరిశ్రమను ఆదుకుంటారని రైతులంతా ఎదురు చూస్తున్నారు.
- పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి