Share News

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. పెళ్లి కోసం నేరం..

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:42 AM

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడితో పెళ్లి కోసం హిజ్రాగా మారాల నుకున్నాడో వ్యక్తి. అయితే ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చువుతుండడంతో దొంగతనానికి ప్లాన్‌ చేశాడు. పక్క ఇంటిని టార్గెట్‌ చేసుకున్నాడు. ఆ ఇంట్లో వృద్ధురాలిపై ప్రియుడితో కలిసి దాడి చేసి బంగారం లాక్కుని పరారై చివరికి పోలీసులకు చిక్కారు.

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. పెళ్లి కోసం నేరం..
తునిలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీహరిరాజు

ఇద్దరు పురుషులు ఇష్టపడి.. ఒకరు హిజ్రాగా మారాలని

మరొకరి షరతు

ఆపరేషన్‌ కోసం దొంగతనానికి ప్లాన్‌

వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి బంగారు గొలుసు, గాజులతో పరారీ

ఇద్దరిని అరెస్ట్‌ చేసిన తుని పోలీసులు

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడితో పెళ్లి కోసం హిజ్రాగా మారాల నుకున్నాడో వ్యక్తి. అయితే ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చువుతుండడంతో దొంగతనానికి ప్లాన్‌ చేశాడు. పక్క ఇంటిని టార్గెట్‌ చేసుకున్నాడు. ఆ ఇంట్లో వృద్ధురాలిపై ప్రియుడితో కలిసి దాడి చేసి బంగారం లాక్కుని పరారై చివరికి పోలీసులకు చిక్కారు.

తునిరూరల్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని పట్టణ పోలీస్‌స్టేషన్లో సోమవారం పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు ఈ కేసు వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సతీష్‌ అలియాస్‌ అవంతి కరెడ్డి 3 సంవత్సరాల క్రితం తుని వచ్చి స్థానిక హిజ్రాలతో కలిసి జీవిస్తున్నాడు. ఆడ లక్షణాలు ఉడడంతో రాత్రి వేళల్లో మహిళ వేషధారణలో జాతీయ రహదారిపై ఉంటూ పలువురిని ఆకరి ్షస్తూ డబ్బులు సంపాదించేవాడు. అలాగే పండుగలు, జాతరలో డ్యాన్సులు వేస్తూ జీవనపాధి పొందేవాడు. అవంతికరెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రశాంత్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. దీంతో వారిద్దరూ తుని పదో వార్డులో నిమ్మకాయల వారి వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాభర్తల్లా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో అవంతిక రెడ్డి తనను పెళ్లి చేసుకోమని ప్రశాంత్‌ను కోరగా ఆపరేషన్‌ చేయించుకుని పూర్తిగా హిజ్రాగా మారితే తాను పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్‌ చె ప్పాడు. దీంతో ఆపరేషన్‌కు అవసరమయ్యే రూ.5 లక్షల కోసం అవ ంతిక రెడ్డి, ప్రశాంత్‌ దొంగతనానికి ప్లాన్‌ వేశారు. వారి ఇంటి పక్కనే ఉన్న వృద్ధురాలు బాలేపల్లి సత్యవతిపై దాడి చేసి బంగా రం చోరీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఈనెల 20న అర్ధరాత్రి దా టిన తర్వాత సత్యవతి ఇంటి వెనుక భాగంలో బాత్రూం వద్దకు రాగా అప్ప టికే వేచి ఉన్న అవంతికరెడ్డి, ప్రశాంత్‌ ఆమె కళ్లల్లో కారం కొట్టారు. చేతులతో నోటిని మూసి మెడలో ఉన్న పగడాల బంగారు గొలుసుతో పాటు చేతికి ఉన్న 4 బంగారు గాజులను లాక్కు ని పరారయ్యారు. దీంతో సత్యవతి తుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తుని సీఐ గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో పలు కోణాల్లో దర్యాప్తు ని ర్వహించిన పోలీసులు సత్యవతి ఇచ్చిన సమాచారం, ఇతర కోణాల్లో దర్యాప్తు ఆధారంగా దోపిడీ చేసింది అవంతికరెడ్డి, ప్రశాంత్‌ అని నిర్ధారించుకుని ఈనెల 24న కొండవారి పేటకు వెళ్లే దారి లో ఉన్న రైల్వే గెస్ట్‌ హౌస్‌ వద్ద వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 5 గ్రాముల పగడాల బంగా రు గొలుసు, సుమారు నాలుగున్నర తూలల బంగారు గాజులు, 2 సెల్‌ఫోన్లు, స్కూటీ స్వా ధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.7 లక్షలు ఉంటుందని డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన తుని సీఐ గీతా రామకృష్ణ, ఎస్‌ఐలు విజయ్‌, పాపారావు, సిబ్బంది యాదవ్‌, నాయు డు, శివయ్యను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌, డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు.

Updated Date - Aug 26 , 2025 | 12:42 AM