Home » Drugs Case
డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో నిరంతర అవగాహన కల్పించడంలో మీడియా ముందుండాలని పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగవద్దని సిబ్బందిని కోరుతున్నామని అన్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మణికొండలో మాదకద్రవ్యాల నిరోధక విభాగానికి చెందిన 'ఈగల్ టీమ్' ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఒక వ్యక్తిని హ్యాష్ ఆయిల్ విక్రయిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డేను నిర్వహిస్తున్నామని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నశాముక్త భారత్ కింద మళ్లీ ఈ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మేజర్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 500 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తమ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలన విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. రౌడీషీటర్లు తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఈగల్ ఫోర్స్ తెలంగాణ, కస్టమ్స్ విభాగం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఛేదించాయి. బ్యాంకాక్ – ఇండియా మార్గంలో సాగుతున్న OG గంజాయి స్మగ్లింగ్ ముఠాను బట్టబయలు చేసి కీలక నిందితులను గుర్తించారు.
కార్పొరేట్ స్కూల్స్‌లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ కార్యాకలాపాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలర్ట్‌గా ఉండి యువతను కాపాడుకోవాలని సూచించారు.
హైదరాబాద్ శివారులోని దుండిగల్ ప్రాంతంలో గంజాయి రవాణాకు పాల్పడిన ఓ డ్రగ్స్ పెడ్లర్‌ను.. ర్యాపిడో రైడర్ పట్టించాడు. ఈ సమాచారాన్ని రైడర్ పోలీసులకు వెంటనే తెలియజేయడంతో డ్రగ్స్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు.