Drug Racket: విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా.. డాక్టర్‌తో సహా 7 మంది అరెస్ట్
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:23 PM
విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. కేరళలోని తిరువనంతపురంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వైద్యుడితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా...
తిరువనంతపురం, జనవరి 1: విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నా ముఠా గుట్టు రట్టు అయింది. కేరళలోని తిరువనంతపురంలో మాదక ద్రవ్యాలను సప్లయ్ చేస్తున్న ముఠాను పోలీసులు(Kerala Police) పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక డాక్టర్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) విద్యార్థినితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా మాదకద్రవ్యాల నిరోధక ప్రత్యేక కార్యాచరణ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అద్దె ఇంట్లో నుంచి ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి , గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన ఏడుగురిని డాక్టర్ విఘ్నేష్ దత్తన్, బీడీఎస్ విద్యార్థిని హలీనా, అసిమ్, అవినాష్, అజిత్, అన్సియా, హరీష్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరైన అవినాష్ ఒక ఐటీ ఉద్యోగి కావాడం గమన్హారం. అలానే అసిమ్, అజిత్, అన్సియా గతంలో కూడా పలు మాదకద్రవ్యాల కేసులలో నిందితులుగా ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
పోలీసులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో నాలుగు గ్రాముల ఎండీఎంఏ, ఒక గ్రాము హైబ్రిడ్ గంజాయి,100 గ్రాముల గంజాయి దొరికింది. నిందితులు(Drug Supply) విద్యార్థులకు హైబ్రిడ్ గంజాయిని గ్రాముకు రూ. 3,000 చొప్పున విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. అలానే రెండు కార్లు, రెండు బైక్‌లను మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో కనియాపురం తోప్పిల్ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ ఈ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయగా.. తమ కారుతో పోలీసు జీపును ఢీకొట్టి పారిపోయారు. ఆ సమయంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమైంది. తాజాగా నిందితులు కనియపురం తోప్పిల్‌లో దాక్కున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇంటిని చుట్టు ముట్టి.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో వైద్య విద్యార్థిని(BDS Student), ఐటీ ఉద్యోగి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి