Biryani: న్యూ ఇయర్ వేడుకలో విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి..15 మందికి అస్వస్థత
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:56 AM
పాత సంవత్సరానికి టాటా చెబుతూ.. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా స్వాగతం పలికారు హైదరాబాద్ నగరవాసులు. అయితే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుపుకున్నారు. పబ్బులు, క్లబ్బులు, ఫామ్ హౌస్, రిసార్ట్స్ కొంతమంది సొంత రూముల్లో న్యూ ఇయర్ సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాదిలో కొన్నిచోట్ల విషాదాలు చోటు చేసుకున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బిర్యాని తిని ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషాద ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో జరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా 17 మంది మద్యం సేవించి చిల్ అయ్యారు. బిర్యానీ తిన్న పాండు(53) అస్వస్థతకు గురై చనిపోయాడు. మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితులను తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే నార్సింగ్‌లో డ్రగ్స్‌తో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ కళ్యాణ్, గోవాకు చెందిన విజయ్ డ్రగ్స్ తీసుకున్నారని,వారిని టెస్ట్ చేయగా పాజిటీవ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..
For More TG News And Telugu News