Share News

Delhi: ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుల కట్టలు.. బంగారు నగలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:01 AM

ఢిల్లీలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఈడీ జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

Delhi: ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుల కట్టలు.. బంగారు నగలు
Money Laundering Case

ఢిల్లీ: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి స్వర్వప్రియ విహార్ ప్రాంతంలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ యాదవ్, అతని అనుచరుల ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కళ్లు చెదిరేలా డబ్బులు, బంగారు నగలు బయటపడ్డాయి. లెక్కల్లో చూపించని రూ.5 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాలు ఉన్న సూట్‌కేసు,35 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ మొత్తం కలిపి సుమారు రూ.48 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఈడీ తెలిపింది.

money.jpg


ప్రస్తుతం అమన్ కుమార్, ఇందర్జీత్ సింగ్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకుల అండతో ఇంద్రజీత్ ప్రైవేట్ ఫైనాన్షియర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు కూడబెట్టినట్లు సమాచారం. ఇందర్జీత్ సింగ్ UAE కేంద్రంగా కార్యాకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోదాల సందర్భం గా డబ్బును లెక్కించడానికి బ్యాంక్ అధికారులు కౌంటింగ్ మిషన్ తెప్పించినట్లు తెలుస్తుంది.


ఇందర్జీత్ యాదవ్,అతని అనుచరులపై హర్యానా, యూపీ రాష్ట్రాల్లో 15 కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంగా ఆయుధాల చట్టంతో పాటు ఇతర కేసులు నమోదు చేసి, చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ డబ్బుల, నగలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2026 | 11:29 AM