Share News

Hyderabad: ఆ లేడీ.. మామూలు మహిళ కాదుగా.. ఏం చేసిందో తెలిస్తే...

ABN , Publish Date - Dec 31 , 2025 | 10:36 AM

ఓ మహిళ.. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో 0.43 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. కాగా.. నగరంలో కొన్ని ఏరియాల్లో ఈ డగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఆ లేడీ.. మామూలు మహిళ కాదుగా.. ఏం చేసిందో తెలిస్తే...

- గోవా నుంచి డ్రగ్స్‌ తెచ్చి..

- మహిళ అరెస్ట్‌.. ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్: వెకేషన్‌ కోసం గోవాకు వెళ్లిన యువతి అందరి మాదిరి అక్కడ బీచ్‌లలో తిరగకుండా డ్రగ్స్‌ వైపు ఆకర్షితురాలైంది. ఓ మహిళ, డ్రగ్‌ పెడ్లర్స్‌తో పరిచయాలు పెంచుకొని మత్తు పదార్థాలను నగరానికి తీసుకువచ్చి అమ్మకాలు చేయడం మొదలు పెట్టింది. గతంలో ఆమెను పోలీసులు అరెస్టు చేసినా తీరు మార్చుకోలేదు. మరోసారి డ్రగ్స్‌ అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. బంజారాహిల్స్‌ పోలీసులు(Banjarahills Police) ఈనెల 29న వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది.


ఆమెను అదుపులోకి తీసుకొని చూడగా హ్యాండ్‌ బ్యాగ్‌లో 0.43 గ్రాముల ఎండీఎంఏ లభించింది. విచారించగా ఆమె బంజారాహిల్స్‌కు చెందిన హస్సా హమీద్‌ అని తేలింది. హస్సా హమీద్‌ ఆరు నెలల క్రితం గోవా(Goa)లో ఎంజాయ్‌ చేసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. కానీ, అక్కడకు వెళ్లాక డ్రగ్స్‌ పెడ్లర్‌లతో పరిచయాలు పెంచుకుంది. వారి ద్వారా డ్రగ్స్‌ సేకరించి నగరంలో అమ్మాలన్నది ఆమె ప్లాన్‌.


city7.2.jpg

ఈ మేరకు నయా సాల్‌ వేడుకల్లో డ్రగ్స్‌ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గోవాకు చెందిన రోమీ భారత్‌ కల్యాణి డ్రగ్స్‌ పొందినట్లు, మీనా, సుమిహా ఖాన్‌, వజీర్‌ బాక్సర్‌లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. కానా హస్సాపై గతంలో గోల్కొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ

మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 31 , 2025 | 10:36 AM