Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:12 PM
హైదరాాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మియాపూర్‌లో లక్షన్నర విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్‌ను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 29: నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం రుపుతోంది. మియాపూర్‌లో 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడింది. మియాపూర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఎస్‌వోటీ మాదాపూర్ టీమ్, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి మియాపూర్ ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రవి, రవిలను అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి సుమారు 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు లక్షా యాభై వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తూ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హోటల్‌లో గంజాయ్...
మరోవైపు మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు.... గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హోటల్ లో వంట మనిషి గా పని చేస్తున్న అభిలాష్ మండల్‌గా గుర్తించారు. అభిలాష్ మండల్ వద్ద నుండి ఒక లక్ష రూపాయలు విలువ చేసే ముడున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌కు వచ్చే వ్యక్తులే టార్గెట్‌గా గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
Read Latest Telangana News And Telugu News