CM Revanth: అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:53 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం ఐదు నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు సీఎం.
హైదరాబాద్, డిసెంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలీదని.. ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులకు సీఎం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రిని జర్నలిస్టులు ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఏం మాట్లాడారని వారు అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కేసీఆర్, తాను మాట్లాడుకున్నది మీకెందుకు చెబుతామని చమత్కరిస్తూ సమాధానం ఇచ్చారు.
అంతేకాకుండా అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం 5 నిమిషాల్లోనే కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆపై వేరే విషయాలపై మీడియాతో సీఎం మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు యాక్సెస్ కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలలకు సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల వరకు మండలిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మీడియాతో చిట్‌చాట్ అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌కు చేరుకున్నసీఎం.. మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో తమ స్ట్రాటజీపై నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. మరికాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ పనిదినాలను బీఏసీ ఖరారు చేయనుంది.
ఇవి కూడా చదవండి...
కేవలం ఐదు నిమిషాలే.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్
Read Latest Telangana News And Telugu News