Kamareddy News: కామారెడ్డిలో బాంబుల కలకలం.. ఓ శునకం స్పాడ్ డెడ్
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:23 PM
కామారెడ్డిలో బాంబులు కలకలం సృష్టించాయి. ఓ రైతు పొలంలో జరిగిన ఈ ఘటనలో ఓ శునకం మరణించింది.
నిజామాబాద్ జిల్లా, డిసెంబర్ 29: కామారెడ్డిలో బాంబులు కలకలం రేపాయి(Bomb Scares at Kamareddy). గర్గుల్ గ్రామ శివారులోని మొగుళ్ల సాయగౌడ్ అనే వ్యక్తికి చెందిన పొలంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కుక్క అక్కడికక్కడే మృతిచెందింది(Dog died with Bomb blast).
బాంబు పేలుడు ఘటనతో భారీ శబ్దంతో పాటు ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు, రైతులు ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు పెట్టి వెళ్లారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: