Share News

River Like a Rainbow: ఇంద్రధనస్సు లాంటి రంగురంగుల నది.. మీరెప్పుడైనా చూశారా.?

ABN , Publish Date - Dec 29 , 2025 | 09:36 AM

అదో నది.. ఆకాశంలోని ఇంద్రధనస్సులా భిన్న వర్ణాలతో కనిపిస్తూ పర్యటకుల మదిని దోచేస్తోంది. సైన్స్, కళలు మిళితం చేస్తూ సహజసిద్ధంగా ప్రవహించే ఈ నది ఎక్కడ ఉంది.. అందులోని అద్భుతమైన రంగు రంగుల దృశ్యాల మర్మమేంటి.. వీటిపై ఓ లుక్కేద్దామా...

River Like a Rainbow: ఇంద్రధనస్సు లాంటి రంగురంగుల నది.. మీరెప్పుడైనా చూశారా.?
Cano Cristales River

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా నదుల్లో నీరు ప్రవహిస్తుండటం.. అమాంతం సముద్రం కలిసిపోవడం చూస్తుంటాం. అయితే.. ఓ నదిలో నీరు మాత్రం రంగు రంగులుగా మారి ఇంద్రధనస్సును తలపిస్తోంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి ఐదు రంగుల కలయికతో అగుపిస్తూ.. చూపరులను కనువిందు చేస్తోంది. ప్రకృతి అద్భుత సృష్టిగా పరిగణించే 'కానో క్రిస్టల్స్ రివర్(Cano Cristales River)'ను ద్రవ ఇంద్రధనస్సు అని కూడా పిలుస్తారు(Rainbow River). ఈ రివర్‌ను చూసేందుకు పర్యటకులు ఎగబడుతుంటారు. ఇంతకీ ఈ నది ఎక్కడుంది? ఆ రంగుల్లో ఆంతర్యమేంటి? దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా మరి...


ఎప్పుడు సందర్శించాలి.?

కొలంబియా(Colombia)లో ఉన్న కాన్ క్రిస్టల్స్ రివర్.. అటు సైన్స్.. ఇటు కళలను మిళితం చేసే ఓ అరుదైన సహజ దృగ్విషయమనే చెప్పవచ్చు. అడవుల గుండా ప్రవహిస్తూ ఎంతో అంతంగా కనిపిస్తుందీ నది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన రివర్‌గా దీనిని భావిస్తుంటారు( Beautiful River in the World). అందుకే స్థానికులు ఈ నదని దివ్య ఉద్యానవనం అని కూడా పిలుస్తారు. నిత్యం ప్రవహించే కాన్ క్రిస్టల్స్‌లో.. ఈ భిన్న వర్ణాలు ఏడాది పొడవునా కనిపించవు. జూన్ - సెప్టెంబర్(June - September) మధ్యలో నది నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే బాగా అగుపిస్తాయి. అందువల్ల ఈ సహజ సౌందర్యమైన బ్యూటిఫుల్ రివర్‌ను చూసేందుకు జూన్ నుంచి నవంబర్(November) వరకూ అత్యంత అనుకూల సమయం.


మర్మమిదే..

మకరేనియా క్లావిగెరా(Macarena Clavigera) అనే జల మొక్క ప్రభావం కారణంగా.. కాన్ క్రిస్టల్స్ నదిలో నీరు ఇలా నీలి రంగు నుంచి వివిధ వర్ణాలకు మారుతుంది. నది దిగువన ఉన్న క్లావిగెరాపై(Clavigera Water Plant) సూర్యరశ్మి పడగానే.. నీరు ఎర్రగా మారుతుంది. విభిన్న కాంతి వేగంతో ప్రకాశవంతమైన నీలం, గులాబీ, నారింజ, మెరూన్ వంటి రంగులు నదిలోని రాళ్లతో కలిసిపోతుంటాయి. నదీ దిగువ భాగంలోనున్న ఈ మొక్క చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా.. పర్యావరణ పరిస్థితులకూ చాలా సున్నితంగా ఉంటుందట. ఈ ప్రత్యేకత ఈ రివర్‌తో పాటు అదే ప్రాంతంలో ప్రవహించే మరో నదికీ ఉందని స్థానికులు చెబుతుంటారు.

అక్కడికి చేరుకోవడమంటే ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చే సాహసంతో కూడిన పనని సందర్శకులు తమ అనుభవాల్ని పంచుకుంటుంటారు. విమానం ద్వారా మకరేనియా పట్టణాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ట్రెకింగ్ చేస్తూ కాన్ క్రిస్టల్స్‌ను సందర్శించవచ్చు. కొన్ని నియమిత ప్రదేశాలలో మాత్రమే ఈ నదిలో ఈతకు అనుకూలమని పర్యటకులు చెప్తుంటారు.


ఇవీ చదవండి:

ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..

ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు

Updated Date - Dec 29 , 2025 | 09:38 AM