Share News

Kailash Kher: అభిమానుల కోసమే అలా చేయాల్సి వచ్చింది: కైలాశ్ ఖేర్

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:05 PM

గ్వాలియర్‌లో ఇటీవల జరిగిన సంగీత కచేరీపై కైలాశ్ ఖేర్ వివరణ ఇచ్చారు. అభిమానులను నియంత్రించడంలో భాగంగానే తాను స్టేజీపై నుంచి దిగాల్సి వచ్చిందన్నారు.

Kailash Kher: అభిమానుల కోసమే అలా చేయాల్సి వచ్చింది: కైలాశ్ ఖేర్
Kailash Kher

ఇంటర్నె్ట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో(Gwalior) ఇటీవల జరిగిన సంగీత కచేరీలో.. జనం దురుసుగా ప్రవర్తించడం వల్లే కైలాశ్ ఖేర్ అక్కడి నుంచి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై గాయకుడు కైలాశ్ ఖేర్(Kailash Kher) తాజాగా స్పందించారు. తాను కచేరీని అర్ధంతరంగా నిలిపేసి వెళ్లిపోయానంటూ వస్తోన్న వార్తలను ఖండించారాయన. అందులో ఏమాత్రం వాస్తవం లేదని.. కొంతసేపు మాత్రమే వేదికపై నుంచి పక్కకు వెళ్లి మరలా కార్యక్రమాన్ని కొనసాగించినట్టు వివరణ ఇచ్చారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంతో వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని అలా చేయాల్సివచ్చిందని చెప్పుకొచ్చారు ఖేర్. ఆ తర్వాత అనుకున్నట్టుగానే కార్యక్రమం పూర్తయిందన్నారు.


'కచేరీ సమయంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేదిక మీదకు దూసుకొచ్చేందుకు యత్నించారు. పురుషులతో పాటు మహిళలూ బారికేడ్లు ఎక్కారు. వారిలో ఏ ఒక్కరు గాయపడినా.. ఆ తర్వాత నేను బాధపడాల్సి వచ్చేది. అందుకే చేసేదేమీ లేక.. స్టేజ్‌పై నుంచి దిగి కిందకు వెళ్లాల్సి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదనే అలా చేశా. పరిస్థితులు సద్దుమణిగాక.. యథాతథంగా కచేరీ కొనసాగించా. అందరూ ఎంజాయ్ చేయడంతో అనుకున్న విధంగా కార్యక్రమం పూర్తయింది' అని కైలాశ్ ఖేర్ చెప్పారు.


ఈ కచేరీలో భాగంగా అభిమానులను ఉద్దేశించి కూడా ఖేర్ మాట్లాడారు. ఇలాంటి ఈవెంట్‌లలో వారు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. భావోద్వేగాలను అదుపు చేసుకుంటే అంతా బావుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన.. నిర్వాహకులు, భద్రతా సిబ్బందిని ప్రశంసించారు. ఒక్కసారిగా జనం గుమికూడితే నియంత్రించడం కష్టతరమన్న ఆయన.. అభిమానులు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఇవీ చదవండి:

అభిమానుల అత్యుత్సాహం.. కింద పడిపోయిన దళపతి

ఇంద్రధనస్సు లాంటి రంగురంగుల నది.. మీరెప్పుడైనా చూశారా.?

Updated Date - Dec 29 , 2025 | 12:05 PM