Share News

Minister Ram Prasad Reddy: మంత్రి భావోద్వేగం.. రంగంలోకి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 29 , 2025 | 02:21 PM

అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసి.. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతారంటూ వస్తున్న వార్తలపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాంతో కేబినెట్ సమావేశంలో కొద్ది సేపు నిశబ్దం ఆవరించింది.

Minister Ram Prasad Reddy: మంత్రి భావోద్వేగం.. రంగంలోకి సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబర్ 29: సాంకేతిక అంశాలను పక్కన పెట్టి జిల్లాల పునర్విభజనను గత వైసీపీ ప్రభుత్వం చేపట్టడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటినే ఉంచాలంటూ వారు ఆందోళనలు, నిరసనలకు దిగారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ఈ సమావేశంలో కొద్ది సేపు నిశ్శబ్దం ఆవరించింది.


జిల్లా కేంద్రం మార్చకుంటే ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను మంత్రి రాం ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానంటూ మంత్రి రాం ప్రసాద్ రెడ్డికి సీఎ చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోపాటు రాం ప్రసాద్ రెడ్డి కేబినెట్ నుంచి బయటకు వచ్చారు. కానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే రాం ప్రసాద్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసి.. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతారని.. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలంటూ స్థానికులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ ఆందోళన చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం

చలితో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి

For TG News and Telugu News

Updated Date - Dec 29 , 2025 | 03:05 PM