Raids On Pubs: పబ్బులపై ఈగల్ మెరుపు దాడులు.. 8 మందికి పాజిటివ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:49 PM
హైదరాబాద్‌లోని పలు పబ్‌లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్‌లోని క్వేక్ ఎరేనా పబ్‌లో తనిఖీలు చేసి, కస్టమర్లకు ర్యాపిడ్ కిట్‌లతో డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్‌గా తేలింది.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్ నగర వ్యాప్తంగా దృష్టి సారించింది. డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది. నగరంలోని పలు పబ్‌లపై ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది. పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్‌లోని క్వేక్ ఎరేనా పబ్‌లో తనిఖీలు చేశారు. కస్టమర్లకు ర్యాపిడ్ కిట్‌లతో టెస్టులు నిర్వహించారు. 8 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది.
రకుల్ సోదరుడి కోసం గాలింపు
డిసెంబర్ 19న మాసబ్ ట్యాంక్ వద్ద ట్రూప్‌బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో అమన్‌ప్రీత్ పాత్రను గుర్తించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది నార్సింగి పరిధిలో పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాలోనూ అమన్‌ప్రీత్ కీలకమని గుర్తించారు. ఆయనకు పరీక్షలు చేసి డ్రగ్స్ వినియోగించినట్టు తేల్చారు.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీకి కేసీఆర్.. చర్చలో పాల్గొంటారా? వెంటనే వెళ్లిపోతారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లి దాక్కోమన్నారు: పాక్ అధ్యక్షుడు