Share News

Aman Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. అందుకేనా?

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:56 PM

ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు.

Aman Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. అందుకేనా?
Rakul Preet Singh Brother Drug Case

ఇంటర్నెట్ డెస్క్: డ్రగ్స్ కేసులో తనపై నమోదైన FIRను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్(Aman Preet Singh). మంగళవారం ఈ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గతేడాది డిసెంబర్ 19 హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు జరిపిన డ్రగ్స్ దాడుల్లో కొకైన్, మిథైలీన్‌డైఆక్సీమెథాంఫేటమిన్(MDMA) స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా.. అమన్ పేరు బయటకు వచ్చింది.


గత నెల రోజుల వ్యవధిలో అమన్ సమారు ఆరుసార్లు డ్రగ్స్(Drugs)కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో అమన్‌ను ఏ7గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసు నమోదైనప్పటి నుంచి అమన్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అమన్‌ను రెగ్యూలర్ కస్టమర్(Regular customer)గా గుర్తించి.. అరెస్ట్(Arrest) చేయడానికి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమన్ అరెస్ట్ నుంచి ఎఫ్ఐఆర్ రద్దు కోసం హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ

విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 07:12 PM