Home » Donald Trump
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ 2018 తర్వాత తాజాగా తొలిసారి అమెరికాకు వెళ్లారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. సౌదీ అరేబియాకు తమ అధునాతన F-35 ఫైటర్ జెట్లను విక్రయించబోతున్నట్టు ట్రంప్ తెలిపారు.
సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ పలు ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని మార్చి ప్రసారం చేయడంపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనకు బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకుగానూ బీబీసీ క్షమాపణలు తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు గానూ తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్‌హౌస్‌కు లేఖ పంపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ మయామీ యూనివర్సిటీ మహిళా గోల్ఫ్ జట్టులో చోటు దక్కించుకుంది. ఆమె తొలి మ్యాచ్ ఫ్లోరిడాలోని ‘ది అన్నికా’ టోర్నీలో ఆడనుంది.
భారత్‌పై ఇటీవల సుంకాలను అమాంతం పెంచేసిన అమెరికా ఇప్పుడు వాటిని తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా జీ20 సదస్సుకు హాజరు కాబోరని ట్రంప్ ప్రకటించడంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండిపడింది.
పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తీరుపై అమెరికా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి.
అమెరికా పౌరసత్వం ఉన్న ఓ భారత సంతతి వ్యక్తిని వలసల శాఖ అధికారులు అతడి ఇమిగ్రేషన్ స్టేటస్ గురించి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిన వైనం తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఘటనను రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఖండించింది.
ఒహాయో గవర్నర్ ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన అద్భుతమైన గవర్నర్‌గా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని హామీ కూడా ఇచ్చారు. వివేక్‌కు మద్దతుగా ఉండాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఆసక్తికరంగా మారింది.