Share News

రెండ్రోజుల్లో డీల్ కుదరకపోతే.. అది నిజమో, కాదో తేలుతుంది.. ఇరాన్ వార్నింగ్‌పై ట్రంప్ రియాక్షన్..

ABN , Publish Date - Feb 02 , 2026 | 09:28 AM

అమెరికా తమపై దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

రెండ్రోజుల్లో డీల్ కుదరకపోతే.. అది నిజమో, కాదో తేలుతుంది.. ఇరాన్ వార్నింగ్‌పై ట్రంప్ రియాక్షన్..
Trump Iran regional war warning

అమెరికా తమపై దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖమేనీ చెప్పింది నిజమో, కాదో తెలియాలంటే రెండ్రోజులు ఆగాలని అన్నారు. ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి ట్రంప్ మీడియాతో మాట్లాడారు (Trump Iran regional war warning).


తాము యుద్ధ ప్రేరేపకులం కాదని, అయితే తమపై ఎవరైనా దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని ఇరాన్ లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మొహరించిన ట్రంప్ యంత్రాంగానికి ఖమేనీ ఇంత సూటిగా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. 'ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు అక్కడ ఉన్నాయి. రెండ్రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరొచ్చని అనుకుంటున్నా. ఒకవేళ కుదరకపోతే ఖమేనీ చెప్పింది నిజమో, కాదో తేలుతుంది' అని ట్రంప్ పేర్కొన్నారు (Iran US negotiations).


ఆది, సోమవారాల్లో హార్ముజ్ జలసంధిలో వ్యూహాత్మక సైనిక కసరత్తు నిర్వహిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది ( Khamenei warning). ఈ కసరత్తు సమయంలో తమ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నాయకుల వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..


స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 02 , 2026 | 09:28 AM