Home » Dog
రోజురోజుకు శునకాల బెడద అధికమవుతున్న నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెంపుడు శునకాలకు ‘మైక్రో చిప్’ అమర్చాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
నేర పరిశోధన, ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాలది కీలక పాత్రని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్వంలో దేశీ కుక్క పిల్లలు (ఇండ్ చెప్పీ మేళా) దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. బీఏ హీరో, ఆడాపై. వోంట్ షాప్' నినాదంతో చేపట్టిన కార్యక్రమాన్ని ఆదివారం జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద కమిషనర్ ఆర్పి కర్జన్ ప్రారంభించారు.
బడికి వెళదామంటే కుక్కల భయం, దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. అడ్డగుట్టలోని ప్రభుత్వ స్కూలు ఎదురుగా గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు రోడ్లపైనే కాపు కాస్తున్నాయి. బడికి వచ్చే విద్యార్థులను కరుస్తుండడంతో భయానక పరిస్థితి ఏర్పడింది.
రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల బైకర్‌ను చూసి వెంటపడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 11 ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని స్పష్టం చేస్తూ.. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేదించింది.
Dog Babu Story: ఆ కుక్క పేరు .. డాగ్ బాబు. తండ్రి పేరు.. కుత్తా బాబు. తల్లి పేరు.. కుతియా దేవి. డాగ్ బాబు మసౌర్హి పోస్ట్ ఆఫీస్ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఆ డాగ్ బాబు ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు.
ఓ కేర్ టేకర్ మొసలిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఇనుప కట్టర్ సాయంతో మొసలిని పట్టుకున్న అతను.. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Shawls To Dogs: బీబీఎమ్పీలోని మొత్తం 8 జోన్లు.. ఈస్ట్, వెస్ట్, సౌత్, ఆర్ఆర్ నగర్, దాసరహళ్లి, బొమ్మనహళ్లి, యళహంక, మహాదేవపురంలలోని కుక్కలకు ఆహారాన్ని పంపిణీ చేయనుంది. బీబీఎమ్పీ ఈ స్కీమ్ను అమలు చేయడానికి.. ప్రతీ జోన్కు ఏటా 36 లక్షల రూపాయలు కేటాయించనుంది.
సిలికాన్ సిటీ బెంగళూరులో వీధికుక్కలకు మాంసాహారం అందించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె టెండర్లు ఆహ్వానించింది. 8 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. రూ.2.88 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనా వేశారు.