Share News

Dog Panics Viral Video: కుక్క ఎంత పని చేసింది.. నడి రోడ్డుపై రచ్చ రచ్చ..

ABN , Publish Date - Jan 11 , 2026 | 06:46 AM

ఓ కుక్క తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. దీంతో భయపడిపోయిన కుక్క అలజడి సృష్టించింది. నడిరోడ్డుపై అటు, ఇటు పరిగెత్తి వాహనాలను కిందపడేసింది. తర్వాత ఓ గ్లాస్ డోర్‌ను కూడా బద్ధలు కొట్టేసింది..

Dog Panics Viral Video: కుక్క ఎంత పని చేసింది.. నడి రోడ్డుపై రచ్చ రచ్చ..
Dog Panics Viral Video

కుక్కలు ఆహారం కోసమో.. నీటి కోసమో వంట పాత్రల్లో తల పెట్టి ఇరుక్కుపోయిన సంఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. వంట పాత్రల్లో తలలు ఇరుక్కుపోయిన సందర్భాల్లో అవి భయపడిపోయి అలజడి సృష్టిస్తుంటాయి. కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా, ఓ కుక్క తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. దీంతో భయపడిపోయిన ఆ కుక్క అలజడి సృష్టించింది. నడిరోడ్డుపై అటూ ఇటూ పరిగెత్తి వాహనాలను కిందపడేసింది. తర్వాత ఓ గ్లాస్ డోర్‌ను కూడా బద్ధలు కొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే..


వంట పాత్రలో తల ఇరుక్కుపోయిన ఓ కుక్క ఆటోలో నుంచి కిందకు పరుగులు తీసింది. అది నేరుగా అద్దాల షాపు దగ్గరకు వెళ్లింది. తలను బలంగా అద్దాల డోర్‌కు కొట్టుకుంది. ఆ కుక్క ఢీకొట్టిన వేగానికి భారీ అద్దాల డోర్ పగిలిపోయింది. ఆ శబ్ధానికి కుక్క భయపడిపోయింది. వెంటనే వెనక్కు పరుగులు తీసింది. అది నేరుగా వెళ్లి రోడ్డు మీద పార్క్ చేసిన స్కూటీని ఢీకొట్టింది. దెబ్బకు స్కూటీ కిందపడిపోయింది. దీంతో ఆ కుక్క మరింత భయపడి..మళ్లీ షాపు వైపు వచ్చింది. అంతటితో ఈ వీడియో ముగిసింది. 11 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్, లైక్స్ తెచ్చుకుంది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..


‘పాపం ఆ కుక్క చాలా భయపడిపోయినట్లు ఉంది. చావు భయంతో రచ్చ రచ్చ చేసింది’..‘మనుషుల్లో మానవత్వం లేదనడానికి ఇదే నిదర్శనం. ఆ కుక్క చాలా భయపడిపోయి ఉంటుంది. జనం చూస్తూ ఉన్నారే తప్ప సాయం చేయటం లేదు’..‘అరే మీరంతా ఎందుకంత బాధపడుతున్నారు. అది ఏఐ వీడియో. చూస్తేనే అర్థం అయిపోతుంది’..‘ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమైన వీడియోనో.. ఏది ఏఐ వీడియోనో అర్థం కావటం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

భారత్‌కు ఎదురుందా

ముంబై భళా ఢిల్లీ డీలా

Updated Date - Jan 11 , 2026 | 06:59 AM