GCC: ఆ రెండు రకాల కుక్కల్ని పెంచితే రూ.లక్ష జరిమానా
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:31 PM
ఆ రెండు రకాల కుక్కల్ని పెంచవద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పేర్కొంది. చూపరులకు భయం కలిగేలా మొరిగే పిట్‌బుల్, రాట్‌వీలర్ శునకాలను పెంచవద్దని జీసీసీ తెలిపింది. ఈ మేరకు అంతే కాకుండా ఈ రెండు రకాలకు చెందిన శునకాలను పెంచితే రూ.లక్ష చొప్పున జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
- జీసీసీ సమావేశంలో తీర్మానం
చెన్నై: చూపరులకు భయం కలిగేలా మొరిగే పిట్‌బుల్, రాట్‌వీలర్ శునకాలను గ్రేటర్ చెన్నై పరిధిలో పెంచడానికి నిషేధం విధించాలనే కౌన్సిల్ తీర్మాణానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. శుక్రవారం రిప్పన్‌భవనంలో జీసీసీ కౌన్సిల్ సమావేశం మేయర్ ఆర్. ప్రియా(Mayor R. Priya) అధ్యక్షతన జరిగింది. డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్, కమిషనర్ కుమారగురుబరన్ పాల్గొన్నారు. ముందుగా నగరంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు 200ల వార్డుల్లో మరుగుదొడ్లతో కూడిన విశ్రాంతి గదులను నిర్మించాలని తీర్మానించారు.

అదేవిధంగా ప్రస్తుతం నగరమంతటా పెంపుడు శునకాలకు లైసెన్స్ తప్పనిసరి చేసి అమలు చేస్తున్నట్లే కొన్ని విదేశీ జాతుల శునకాల పెంపకంపై నిషేదం విధిస్తే బాగుంటుందని కొంతమంది కార్పొరేటర్లు సూచించారు. ప్రస్తుతానికి పిట్‌బుల్, రాట్‌వెయిలర్ అనే రెండు రకాలకు చెందిన శునకాలను పెంచేందుకు నిషేధం అమ లు చేస్తున్నట్లు మేయర్ ప్రియ ప్రకటించారు. అంతే కాకుండా ఈ రెండు రకాలకు చెందిన శునకాలను పెంచితే రూ.లక్ష చొప్పున జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
బ్యాంకింగ్ వదిలి చాక్లెట్ మేకింగ్
Read Latest Telangana News and National News