Home » DMK
విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్‌లోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఎద్దేవా చేశారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు
వచ్చే యేడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా అన్నాడీఎంకే జాతీయపార్టీ బీజేపీతో అత్యవసరం పొత్తును ఖరారు చేసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.
తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని 'ఇండియా' కూటమి భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగుపరచుకునే వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందనే చెప్పాలి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు మైత్రేయన్ డీఎంకేలో చేరారు.