Share News

MP Kanimozhi: రాజకీయాల్లోకి ఎవరొచ్చినా వారికి డీఎంకే టార్గెట్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:05 PM

కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ప్రజలకు తాము చేయబోయే సత్కార్యాలను గురించి చెప్పకుండా డీఎంకేని అదే పనిగా తిట్టడమే ఆనవాయితీగా మారిందని ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా కన్నియాకుమారి రౌండ్‌ఠాణా జంక్షన్‌ వద్దనున్న విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.

MP Kanimozhi: రాజకీయాల్లోకి ఎవరొచ్చినా వారికి డీఎంకే టార్గెట్‌

- ఎంపీ కనిమొళి

చెన్నై: కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ప్రజలకు తాము చేయబోయే సత్కార్యాలను గురించి చెప్పకుండా డీఎంకే(DMK)ని అదే పనిగా తిట్టడమే ఆనవాయితీగా మారిందని ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా కన్నియాకుమారి(Kanniyakumari) రౌండ్‌ఠాణా జంక్షన్‌ వద్దనున్న విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.


nani4.2.jpg

ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రవేశం చేసేవారంతా డీఎంకేపై విమర్శలు చేస్తేనే తమ పార్టీకి గుర్తింపు లభిస్తుందని భావించడం పరిపాటిగా మారిందన్నారు. ఏడు దశబ్దాలకు పైగా ప్రజలతో మమేకమైన డీఎంకేని దూషించే అర్హత తమకు ఏ మాత్రం లేదని తెలిసి కూడా కొత్త పార్టీల నేతలు దూషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనో తంగరాజ్‌, కన్నియాకుమారి మేయర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 01:09 PM