Share News

CM Stalin: ఇలా ఉంటే కుదరదు.. వారానికి 4 రోజులు ప్రజలతో గడపండి

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:33 AM

వారానికి నాలుగురోజుల పాటు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకేకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం స్టాలిన్‌న జరిగింది.

CM Stalin: ఇలా ఉంటే కుదరదు.. వారానికి 4 రోజులు ప్రజలతో గడపండి

- డీఎంకే ఎంపీలకు స్టాలిన్‌ దిశానిర్దేశం

చెన్నై: వారానికి నాలుగురోజుల పాటు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకేకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం స్టాలిన్‌న జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఉంగలుడన్‌ స్టాలిన్‌’, ‘నలమ్‌ కాక్కుం స్టాలిన్‌’ శిబిరాలకు ఎంపీలు కూడా హాజరుకావాలని, ఆ శిబిరాల్లో ప్రజలు ఇచ్చే వినతులను పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.


ముఖ్యంగా కలైంజర్‌ మహిళా సాధికారిక పథకం కింద గృహిణులకు ప్రతినెలా రూ.1000లు వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతున్నాయా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఆ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను కూడా పరిశీలించి, వారి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలన్నారు.


nani2.2.jpg

2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి 39 సీట్లను గెలుచుకునేందుకు డీఎంకే మిత్రపక్షాల ఎమ్మెల్యేలు తీవ్రంగా శ్రమించారని, ఆ విధంగానే వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి సభ్యుల విజయాకిఇ ఎంపీలు శ్రమించాలని స్టాలిన్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌, కోశాధికారి, ఎంపీ టీఆర్‌బాలు, ఎంపీలు కనిమొళి, తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2025 | 11:33 AM